logo

ఉపాధ్యాయుల కలెక్టరేట్‌ ముట్టడి

అపరిష్కృత సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీటీఎఫ్‌ చేపట్టిన వంద రోజుల పోరు బాటలో భాగంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ను ఉపాధ్యాయులు గురువారం ముట్టడించారు.

Published : 12 Aug 2022 02:16 IST

ప్రవేశ ద్వారం వద్ద నుంచి ఉపాధ్యాయులను పక్కకు నెట్టేస్తున్న పోలీసులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: అపరిష్కృత సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీటీఎఫ్‌ చేపట్టిన వంద రోజుల పోరు బాటలో భాగంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ను ఉపాధ్యాయులు గురువారం ముట్టడించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల మాట్లాడుతూ.. 3, 4, 5 తరగతులను విలీనం చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నం.117ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ రద్దు చేసి పాత పింఛను విధానాన్ని కొనసాగించాలని కోరారు. పాఠశాలల్లో తెలుగు, ఆంగ్ల మధ్యమాలను కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఉదయం 10 గంటలకల్లా ఉపాధ్యాయులు కలెక్టరేట్‌కు చేరుకుని ప్రవేశ ద్వారాన్ని ముట్టడించారు. దీంతో రెవెన్యూతో పాటు, ఇతర శాఖల ఉద్యోగులు మరో మార్గం ద్వారా లోపలికి ప్రవేశించాల్సి వచ్చింది. ఉదయం 11.00 గంటల సమయంలో ప్రవేశ ద్వారానికి అడ్డుగా ఉన్నారని.. పక్కకు వెళ్లాలని ఉపాధ్యాయులకు పోలీసులు సూచించారు. అందుకు వారు నిరాకరించడంతో బలవంతంగా పక్కకు నెట్టేశారు. కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని