logo

దివ్యాంగుల వారధి.. ఈ సారథి

దివ్యాంగుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపై సరైన అవగాహన లేకపోవడంతో చాలా మంది అవకాశాలు కోల్పోతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందేందుకు  

Updated : 12 Aug 2022 02:17 IST

దివ్యాంగుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపై సరైన అవగాహన లేకపోవడంతో చాలా మంది అవకాశాలు కోల్పోతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందేందుకు గతంలో వారు ఎన్నో వ్యయ ప్రయాసలకు గురయ్యేవారు. ఈ నేపథ్యంలో దివ్యాంగుల ఇబ్బందులను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ‘దివ్యాంగ సారథి’ పేరిట యాప్‌ను రూపొందించింది.  యాప్‌ అందుబాటులోకి రావడంతో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. అంధత్వం, వినికిడి లోపం, మూగ వారు, నడవలేని వారు, మానసిక దివ్యాంగులు, పక్షపాతం తదితర వాటితో బాధపడుతున్న వారికి ఈ యాప్‌ ఎంతో తోడ్పాటు అందిస్తుంది.

-న్యూస్‌టుడే, పామూరు

సులభంగా తెలుసుకోవచ్చు
స్మార్ట్‌ ఫోన్‌లో గూగుల్‌ ప్లే స్టోర్‌ లోకి వెళ్లి ‘దివ్యాంగ సారథి’ అని టైప్‌ చేసి ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. దివ్యాంగులకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, సేవలు, ఉపకార వేతనాలు, కృత్రిమ అవయవాలు, అవసరం ఉన్నవారు.. ఎవరిని సంప్రదించాలి? వాటిని పొందేందుకు ఎంత రుసుము చెల్లించాలి? తదితర వివరాలు ఈ యాప్‌ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. దివ్యాంగుల సంక్షేమం కోసం పనిచేస్తున్న సంస్థలు, శిక్షణ కేంద్రాల వివరాలు అందుబాటులో ఉంటాయి.

ఎన్నో వివరాలు...
దివ్యాంగులకు అమలులో ఉన్న రవాణా సౌకర్యాలు, రాయితీలు, దీన్‌దయాళ్‌ దివ్యాంగుల పునరావాస పథకం వివరాలు ఉంటాయి. దివ్యాంగ విద్యార్థులకు ఉన్న విద్య, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చే సంస్థలు, జాతీయ ఉపకార వేతనాలు, ప్రీమెట్రిక్‌, పోస్ట్‌మెట్రిక్‌ ఉపకార వేతనాల వివరాలు, విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలనుకునే వారికి అందుబాటులో ఉన్న అవకాశాలు, వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ అవకాశాలు, అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాలు, స్వామి వివేకానంద జాతీయ దివ్యాంగుల పునరావాస శిక్షణ కేంద్రం, పండిత్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ దివ్యాంగుల జాతీయ సంస్థ వంటి ప్రముఖ సంస్థలు, వాటి ప్రాంతీయ కేంద్రాల చిరునామాలు, అందిస్తున్న సేవల వివరాలు తదితర వాటిని అందుబాటులో ఉంచారు.

ఎంతో ఉపయుక్తం
దివ్యాంగ సారథి యాప్‌ ద్వారా జాతీయ స్థాయిలో దివ్యాంగులకు సంబంధించిన శిక్షణలు, సేవలు, ఉపకార వేతనాలు, ఉద్యోగ అవకాశాలు, కృత్రిమ అవయవాలు తదితర వాటిని తెలుసుకోవచ్చు. ఈ యాప్‌ దివ్యాంగులకు ఎంతో ఉపయుక్తం. సాంకేతికను, యాప్‌ల ద్వారా దివ్యాంగులు ఎప్పటికప్పుడు అన్ని విషయాలను తెలుసుకుని అవకాశాలను అందిపుచ్చుకుని  అభివృద్ధి చెందాలి.

- జి.అర్చన, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని