logo

1000 మంది మహిళలు.. త్రివర్ణ పతాక రెపరెపలు

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా జాతీయ జెండాలతో డీఆర్డీఏ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రదర్శన నిర్వహించారు. సుమారు 1,000 మంది స్వయం సహాయక సంఘాల మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు. వీరిలో పలువురు త్రివర్ణ పతాకంలోని రంగుల చీరలు ధరించి పాల్గొనడంతో కలెక్టర్‌రేట్‌ ప్రాంతం వర్ణరంజితంగా

Published : 13 Aug 2022 05:22 IST

మువ్వన్నెల చీరలు ధరించి నినాదాలు చేస్తున్న స్వయం సహాయక సంఘాల సభ్యులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా జాతీయ జెండాలతో డీఆర్డీఏ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రదర్శన నిర్వహించారు. సుమారు 1,000 మంది స్వయం సహాయక సంఘాల మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు. వీరిలో పలువురు త్రివర్ణ పతాకంలోని రంగుల చీరలు ధరించి పాల్గొనడంతో కలెక్టర్‌రేట్‌ ప్రాంతం వర్ణరంజితంగా మారింది. చర్చి సెంటర్‌లో మానవహారంగా ఏర్పడి కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగు బుడగలను ఆకాశంలోకి వదిలారు. అనంతరం ప్రదర్శన మినీ స్టేడియం వరకు సాగింది. ఈ కార్యక్రమాన్ని కలెక్టరేట్‌ వద్ద తొలుత కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని, మహనీయుల జీవిత విశేషాలను భావితరాలకు తెలియజేసేలా అమృత్‌ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 14న ఒంగోలు నగరంలో మూడు కిలో మీటర్ల పొడవైన జాతీయ జెండాతో ‘3కె నడక’ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఆర్వో సరళావందనం, డీఆర్డీఏ పీడీ బాబూరావు, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ టి.శ్రీనివాస్‌ విశ్వనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని