logo

ఆ ఇల్లే.. ఓ చదువుల కోవెల

తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులు. వారి ఇద్దరి కుమారులూ ఒకరిని మించి ఒకరు పోటీ పరీక్షల్లో విజయాలు సొంతం చేసుకుంటున్నారు. పీసీపల్లికి చెందిన పోలు మాల్యాద్రిరెడ్డి, లక్ష్మీకాంత దంపతులు. మాల్యాద్రి దర్శి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌గా, లక్ష్మీకాంత తాళ్లూరు మండలం తూర్పుగంగవరం

Updated : 13 Aug 2022 05:33 IST

రాష్ట్ర.. జాతీయ స్థాయిలో ప్రతిభ

పోటాపోటీగా రాణిస్తున్న అన్నదమ్ములు

పీసీపల్లి, ఒంగోలు నగరం- న్యూస్‌టుడే:

తల్లిదండ్రులు మాల్యాద్రి రెడ్డి, లక్ష్మీకాంతలతో లోకేష్‌ రెడ్డి, లోహిత్‌ రెడ్డి

తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులు. వారి ఇద్దరి కుమారులూ ఒకరిని మించి ఒకరు పోటీ పరీక్షల్లో విజయాలు సొంతం చేసుకుంటున్నారు. పీసీపల్లికి చెందిన పోలు మాల్యాద్రిరెడ్డి, లక్ష్మీకాంత దంపతులు. మాల్యాద్రి దర్శి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌గా, లక్ష్మీకాంత తాళ్లూరు మండలం తూర్పుగంగవరం పాఠశాలలో ఎస్జీటీగా విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగాలరీత్యా ఒంగోలు సమతానగర్‌లో స్థిరపడ్డారు. వీరి కుమారులు లోకేష్‌ రెడ్డి, లక్ష్మీసాయి లోహిత్‌ రెడ్డి.

ఇద్దరూ ఇద్దరే...

మాల్యాద్రి రెడ్డి పెద్ద కుమారుడు లోకేష్‌రెడ్డి అయిదో తరగతి వరకు పొదిలిలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో చదివాడు. ఆరు నుంచి పది వరకు గుడివాడ సమీపంలోని విశ్వభారతి పాఠశాలలో పూర్తి చేశాడు. ఇంటర్‌ తెలంగాణలోని హైదారాబాద్‌లో చదివాడు. గతేడాది నిర్వహించిన తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో 23 ర్యాంక్‌, ఆంధ్రప్రదేశ్‌లో 17, జేఈఈ మెయిన్స్‌లో 4, జేఈఈ అడ్వాన్స్‌లో 5 ర్యాంక్‌ సాధించి ముంబైలో ఐఐటీలో ప్రవేశం పొందాడు. ప్రస్తుతం సీఎస్‌ఈ మొదటి ఏడాది పూర్తిచేశాడు. చిన్న కుమారుడైన లక్ష్మీసాయి లోహిత్‌ రెడ్డి కూడా అన్న స్ఫూర్తితో అతనికి మిన్నగా ప్రతిభ చూపుతున్నాడు. ప్రాథమిక విద్య పొదిలిలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో పూర్తిచేశాడు. ఆరు నుంచి పదో తరగతి వరకు గుడివాడ విశ్వభారతిలో, ఇంటర్‌ హైదారాబాద్‌లో చదివాడు. శుక్రవారం విడుదలైన తెలంగాణ ఎంసెట్‌లో లోహిత్‌ రెడ్డి మొదటి స్థానంలో నిలిచాడు. ఇంటర్‌లో వెయ్యికి 979 మార్కులు పొందాడు. ఏపీఈఏపీ సెట్‌లో రెండో ర్యాంకు, తెలంగాణ ఎంసెట్‌లో ఒకటో ర్యాంకు, జేఈఈ మెయిన్స్‌లో 27వ ర్యాంకు, బిట్‌శాట్‌లో 390కి 366 మార్కులు కైవసం చేసుకున్నాడు. ఈ నెల 28న నిర్వహించనున్న అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లోనూ ఉత్తమ ర్యాంకు సాధిస్తానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తాము మెరుగైన ప్రతిభ చూపుతున్నట్టు సోదరులిద్దరూ చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని