logo

ప్రభుత్వ భూముల రక్షణకు చర్యలు

కనిగిరిలో పశువుల బీడు, ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్న అక్రమార్కుల గురించి తెలియజేస్తూ ‘ఈనాడు’లో శుక్రవారం ‘పశువుల మూతికట్టి.. నేతలే మేసి..’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన కనిగిరి ఆర్డీవో సందీప్‌కుమార్‌, తహసీల్దార్‌ ఉయ్యాల పుల్లారావు, సిబ్బంది ఆక్రమిత ప్రాంతాలను శుక్రవారం పరిశీలించారు.

Published : 13 Aug 2022 05:22 IST

పెరుగుపల్లిలో ఆక్రమిత పశువుల బీడు భూములను పరిశీలిస్తున్న ఆర్డీవో

సందీప్‌కుమార్‌, తహసీల్దార్‌ పుల్లారావు, అధికారులు

కనిగిరి: కనిగిరిలో పశువుల బీడు, ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్న అక్రమార్కుల గురించి తెలియజేస్తూ ‘ఈనాడు’లో శుక్రవారం ‘పశువుల మూతికట్టి.. నేతలే మేసి..’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన కనిగిరి ఆర్డీవో సందీప్‌కుమార్‌, తహసీల్దార్‌ ఉయ్యాల పుల్లారావు, సిబ్బంది ఆక్రమిత ప్రాంతాలను శుక్రవారం పరిశీలించారు. వెలిగండ్ల మండలం హుస్సేన్‌పురం, పెరుగుపల్లి, పందువ, తమ్మినేనిపల్లి, కనిగిరి మండలం ఎన్‌.గొల్లపల్లి తదితర ప్రాంతాల్లోని ఆక్రమిత భూములను తనిఖీ చేశారు. ఆయా ప్రదేశాల్లో ప్రభుత్వ భూములుగా తెలిపే బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ, పశువుల బీడు, వాగు పోరంబోకు, అసైన్‌మెంట్ భూములను ఎవరు ఆక్రమించినా, దొంగ పట్టాలు సృష్టించి ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆక్రమిత భూముల జాబితాను తయారు చేయాలని ఆయా గ్రామాల వీఆర్వోలను ఆదేశించినట్లు తెలిపారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు