logo
Published : 14 Aug 2022 02:31 IST

డీసీసీ మాజీ అధ్యక్షుడు ముసలరావు మృతి

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: జిల్లా కాంగ్రెస్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు దేవతు ముసలరావు(పాపా) (81) శనివారం మృతి చెందారు. ఒంగోలు నగరంలోని లాయర్‌పేటకు చెందిన ఆయన గతంలో డీసీసీ అధ్యక్షుడిగా, మంగళూరు పోర్ట్‌ డైరెక్టర్‌గా, జిల్లా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. కౌన్సిలర్‌గా, వైశ్యా బ్యాంకు డైరెక్టర్‌గా సేవలందించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆయన సోదరుడు శ్రీరాములు తెలిపారు. ముసలరావు మృతికి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ యక్కల తులసీరావు, ఆర్యవైశ్య కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కుప్పం ప్రసాద్‌, డిప్యూటీ మేయర్‌ వేమూరి సూర్యనారాయణ తదితరులు సంతాపం తెలిపారు.

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని