logo

మద్యంపై మాట తప్పారు.. మడమ తిప్పారు

మద్య నిషేధం ఎక్కడని ప్రశ్నిస్తూ తెలుగు మహిళలు, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ల ఆధ్వర్యంలో శనివారం కనిగిరిలో నిరసన చేపట్టారు. తెలుగు మహిళ ఒంగోలు పార్లమెంటు అధికార ప్రతినిధి కరణం....

Published : 14 Aug 2022 02:41 IST


నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న తెలుగు మహిళలు, నాయకులు

కనిగిరి, న్యూస్‌టుడే: మద్య నిషేధం ఎక్కడని ప్రశ్నిస్తూ తెలుగు మహిళలు, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ల ఆధ్వర్యంలో శనివారం కనిగిరిలో నిరసన చేపట్టారు. తెలుగు మహిళ ఒంగోలు పార్లమెంటు అధికార ప్రతినిధి కరణం అరుణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలుచేస్తామని చెప్పి మాట తప్పారన్నారు. ఇతర కంపెనీల బ్రాండ్‌లను నిషేధించి తన వాటాలు గల కంపెనీల బ్రాండ్‌లను విక్రయిస్తూ మహిళల పుస్తెలు తెంచుతున్నారన్నారు. కొత్త బార్ల విధానంతో రాష్ట్రాన్ని మరింత మత్తులోకి దించుతున్నారన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసే జె బ్రాండ్‌ మద్యాన్ని వెంటనే నిషేధించాలన్నారు. తొలుత ప్రధాన వీధుల్లో మద్యం సీసాలను చేతపట్టుకుని సీఎం జగన్‌ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. తీగలగొందిలోని దుకాణం ముందు మద్యాన్ని పారబోసి సీసాలు పగలగొట్టారు. రాష్ట్ర తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి కొణిజేటి సుభాషిణి, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు సుబ్బారావు, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ అఫ్రోజ్‌, మహిళా నేతలు వాజీదా బేగం, పార్వతినారాయణమ్మ, తులసి.. నాయకులు నంబుల వెంకటేశ్వర్లు, తమ్మినేని శ్రీనివాసరెడ్డి, పి.శ్రీనివాసరెడ్డి, షేక్‌ ఫిరోజ్‌, బి.పుల్లారెడ్డి, గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని