logo

ఎంపీ మాధవ్‌పై తెదేపాది అసత్య ప్రచారం: బుర్రా

బీసీలను అణగదొక్కేందుకే అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌పై తెదేపా నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెలే, వైకాపా జిల్లా అధ్యక్షుడు

Published : 14 Aug 2022 02:41 IST

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మధుసూదన్‌యాదవ్‌, చిత్రంలో
నగర పంచాయతీ ఛైర్మన్‌ అబ్దుల్‌ గఫార్‌,  జడ్పీటీసీ సభ్యుడు కస్తూరి రెడ్డి తదితరులు

కనిగిరి, న్యూస్‌టుడే: బీసీలను అణగదొక్కేందుకే అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌పై తెదేపా నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెలే, వైకాపా జిల్లా అధ్యక్షుడు బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ పేర్కొన్నారు. ఆయన నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ... నకిలీ వీడియో చూపుతూ ఎంపీని కించపరుస్తున్నారని ఆరోపించారు. తెదేపా వారి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు.

పెరుగుపల్లి గొడవ మీడియా సృష్టే: వెలిగండ్ల మండలం హుస్సేన్‌పురం పంచాయతీ పెరుగుపల్లిలో నిర్వహించిన ‘గడప గడప...’ కార్యక్రమంలో ఎలాంటి గొడవా జరగలేదని అంతా మీడియా సృష్టేనని ఎమ్మెల్యే అన్నారు. తనను ఎవరూ ప్రశ్నించలేదని... కొందరు బయట వ్యక్తులు జోక్యం చేసుకోవడంతో శాంతిభద్రతలు కాపాడేందుకు ఎస్సై విశ్వనాథరెడ్డి... మహిళలతో సామరస్యంగా మాట్లాడి సర్దిచెప్పి పంపారన్నారు. పశువుల బీడు ఆక్రమణ గురించి కొందరు అడిగితే... కోర్టులో ఉన్నందున, క్లియరెన్స్‌ వచ్చాక ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని చెప్పానన్నారు. సమావేశంలో జడ్పీటీసీ సభ్యులు మడతల కస్తూరి రెడ్డి, ఛైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ గఫార్‌, వెలిగండ్ల జడ్పీటీసీ మాజీ సభ్యుడు రామన తిరుపతిరెడ్డి, వైకాపా నాయకులు ఎస్‌.రంగనాయకులరెడ్డి, ఎస్‌.సుబ్బారెడ్డి, శ్రీహరిరెడ్డి, పిచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని