logo

జగనన్న కాలనీని వదల్లేదు

గిద్దలూరులోని జగనన్న కాలనీలో ప్రజావసరాల కోసం వదిలిన స్థలాన్ని ఆక్రమించి ఓ స్థిరాస్తి వ్యాపారి తన లేఅవుట్‌కు అనుగుణంగా రహదారి నిర్మించేశారు. ఇంతవరకు అధికారులు అటు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ పట్టణంలోని ఒంగోలు-నంద్యాల రహదారిలో గల ఉద్యానశాఖ స్థలంలో జగన్నకాలనీ ఏర్పాటు చేసి 320 ప్లాట్లను

Published : 27 Sep 2022 02:08 IST

ఆక్రమించి రోడ్డు నిర్మాణం

ఓ స్థిరాస్తి వ్యాపారి నిర్వాకం

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే:

జగనన్న కాలనీలో ఖాళీగా వదిలిన స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేపట్టిన రహదారి

గిద్దలూరులోని జగనన్న కాలనీలో ప్రజావసరాల కోసం వదిలిన స్థలాన్ని ఆక్రమించి ఓ స్థిరాస్తి వ్యాపారి తన లేఅవుట్‌కు అనుగుణంగా రహదారి నిర్మించేశారు. ఇంతవరకు అధికారులు అటు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ పట్టణంలోని ఒంగోలు-నంద్యాల రహదారిలో గల ఉద్యానశాఖ స్థలంలో జగన్నకాలనీ ఏర్పాటు చేసి 320 ప్లాట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రజలకు వివిధ సౌకర్యాలు కల్పించేందుకు 29 సెంట్ల ఖాళీ స్థలాన్ని అధికారులు వదిలారు. దీంతో ఓ స్థిరాస్తి వ్యాపారి కన్నుపడింది. సమీపంలో తాను వేసిన లేఅవుట్‌కు రోడ్డు కోసం కాలనీలోని 7వ లైనులో ఖాళీ స్థలాన్ని ఆక్రమించారు. గ్రావైల్‌ తోలి రహదారి నిర్మాణం చేపట్టారు.

చూసీచూడనట్లు..

స్థిరాస్తి వ్యాపారి జగనన్న కాలనీ వెనుక వైపు అక్రమ లేఅవుట్‌ వేస్తున్న సమయంలో పలువురు కౌన్సిలర్లు నగర పంచాయతీ సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. కాలనీకి ప్రహరీ నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేశారు. లేఅవుట్‌లోకి కాలనీ ప్రధాన రహదారి నుంచి వెళ్లకుండగా చివరన యంత్రంతో గుంతలు తీశారు. ఇటీవల ఆ వ్యాపారి ఆ గుంతలను పూడ్చివేయడమే గాక తాజాగా ప్రజావసరాలకు వదిలిన ఖాళీ స్థలాన్ని కలిపి రోడ్డు వేసేశారు. కమిషనర్‌ రామకృష్ణయ్య దృష్టికి తీసుకువెళ్లగా నగర పంచాయతీ స్థలంలో రహదారి నిర్మాణం చేపట్టినట్లయితే వెంటనే తొలగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాలనీ చుట్టూ ప్రహరీ నిర్మిస్తామన్నారు. అనుమతి లేకుండా లేఅవుట్‌ వేస్తున్న వ్యాపారికి నోటీసులు జారీచేస్తామన్నారు.

బేరం పెట్టి ప్లాట్ల విక్రయం

జగనన్న కాలనీలో నివేశన స్థలాలు పొందిన కొందరు లబ్ధిదారులు వాటికి బేరం పెట్టారు. కేటాయించిన ప్లాట్లను రూ.4.50 లక్షల వంతున విక్రయిస్తుండటం వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే కొన్ని క్రయవిక్రయాలు జరిగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని