logo

లంపీ స్కిన్‌తో విలవిల

కనిగిరి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల గోవుల్లో లంపీ స్కిన్‌ (చర్మ గడ్డల వ్యాధి) కనిపిస్తోంది. ఇప్పటికే కనిగిరి పట్టణంలో నాలుగు.. వెలిగండ్ల, సీఎస్‌పురం, పామూరు మండలాల్లో మరో ఆరు ఆవుల్లో ఈ లక్షణాలు కనిపించాయి. దీంతో వాటి పోషకులు తల్లడిల్లుతున్నారు. గత ఏడాది కూడా పది ఆవులు చనిపోయాయి. వ్యాధి త్వరితంగా

Published : 27 Sep 2022 02:08 IST

ఆందోళనలో గోవుల పోషకులు

వ్యాధి సోకిన కోడె దూడ

కనిగిరి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల గోవుల్లో లంపీ స్కిన్‌ (చర్మ గడ్డల వ్యాధి) కనిపిస్తోంది. ఇప్పటికే కనిగిరి పట్టణంలో నాలుగు.. వెలిగండ్ల, సీఎస్‌పురం, పామూరు మండలాల్లో మరో ఆరు ఆవుల్లో ఈ లక్షణాలు కనిపించాయి. దీంతో వాటి పోషకులు తల్లడిల్లుతున్నారు. గత ఏడాది కూడా పది ఆవులు చనిపోయాయి. వ్యాధి త్వరితంగా వ్యాపిస్తుంది. ఎన్ని మందులు వాడినా తగ్గకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కోడె దూడలు, ఆవుల చర్మం లోపల గడ్డలు గడ్డలుగా ఏర్పడి తర్వాత శరీరమంతా వ్యాపిస్తున్నాయి. రక్తం, చీము వస్తుండటం.. పుండ్ల రంధ్రాల్లో క్రిములు చేరి శరీరమంతా పాకి మృతి చెందుతున్నాయి. ఈ నియోజకవర్గంలో 25 వేలకు పైగా ఆవులు ఉన్నాయి. పశు వైద్యాధికారులు శిబిరాలు ఏర్పాటుచేసి వ్యాధి విస్తృతి చెందకుండా అడ్డుకట్ట వేయాలని యజమానులు కోరుతున్నారు. ఏడీఏ డాక్టర్‌ కె.సత్యనారాయణ మాట్లాడుతూ లంపీ స్కిన్‌ సోకిన గోవుల యజమానులకు తగిన సూచనలు అందజేస్తున్నామన్నారు. ఈ వ్యాధి దేశవ్యాప్తంగా ఉందన్నారు. సోకితే నయం కావడానికి చాలా సమయం పడుతుందన్నారు. యజమానులు సమీపంలోని పశు వైద్యాధికారులను సంప్రదించి గోవులకు యాంటీ బయోటిక్స్‌ వాడాలన్నారు. అలాగే వ్యాధి రాకుండా ముందస్తుగా గోట్‌ పాక్స్‌ టీకాలు వేయించాలన్నారు.

-న్యూస్‌టుడే, కనిగిరి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని