logo

శాంతిభద్రతల పరిరక్షణలో మహిళా పోలీసులు కీలకం

గ్రామస్థాయిలో శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించి మహిళా పోలీసులది అత్యంత కీలకపాత్ర అని ఎస్పీ మలికా గార్గ్‌ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయం నుంచి సోమవారం అధికారులు, గ్రామ/వార్డు మహిళా పోలీసులతో నిర్వహించిన జూమ్‌ సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. శాంతిభద్రతలు, నేర నియంత్రణ, చట్టవ్యతిరేక కార్యకలాపాలు,

Published : 27 Sep 2022 02:08 IST

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ మలికా గార్గ్‌, చిత్రంలో అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, ఎస్‌బీ డీఎస్పీ మరియదాసు

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: గ్రామస్థాయిలో శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించి మహిళా పోలీసులది అత్యంత కీలకపాత్ర అని ఎస్పీ మలికా గార్గ్‌ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయం నుంచి సోమవారం అధికారులు, గ్రామ/వార్డు మహిళా పోలీసులతో నిర్వహించిన జూమ్‌ సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. శాంతిభద్రతలు, నేర నియంత్రణ, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, సైబర్‌ నేరాలు, రుణ యాప్‌లపై అవగాహన, ఇతర అంశాలపై మహిళా పోలీసులు నిర్వహిస్తున్న విధుల గురించి వీక్లీ పోర్టల్‌లో నమోదు తీరును పరిశీలించారు. మెరుగైన పనితీరు కోసం మార్గదర్శకాలు జారీ చేశారు. గ్రామాల్లో మహిళలు, చిన్న పిల్లలపై జరిగే నేరాలు.. ఒంటరి మహిళల సమాచారం, సైబర్‌ నేరాలపై ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు. దిశ ఎస్‌ఓఎస్‌ యాప్‌ను ఒంటరి మహిళల చరవాణిలో తప్పనిసరిగా డౌన్‌లోడ్‌ చేయించాలని సూచించారు. కుటుంబ తగాదాలు, భార్యా భర్తల మధ్య వివాదాలకు కౌన్సెలింగ్‌ నిర్వహించాలన్నారు. గ్రామాల్లో తాజా పరిణామాలు, భూతగాదాలు, రాజకీయ గొడవలు, పాతకక్షలు, ఆర్థిక వివాదాల గురించి ఎప్పటికప్పుడు మహిళా పోలీసులు పై అధికారులకు తెలియజేయాలన్నారు. వారు ఇచ్చిన సమాచారాన్ని విశ్లేషిస్తూ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తద్వారా క్షేత్రస్థాయిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరనియంత్రణ మరింత మెరుగ్గా ఉంటుందన్నారు.

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని