logo

అర్హులైన ఓటర్లనూ తొలగిస్తున్నారు

‘‘ఓటరు జాబితాకు ఆధార్‌ అనుసంధాన ప్రక్రియలో వాలంటీర్ల పాత్ర ఎక్కువగా ఉంది.. కొన్ని చోట్ల అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ అర్హులైన ఓటర్లను తొలగించేలా వ్యవహరిస్తున్నారు’’ అని కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి కలెక్టర్‌ దినేష్‌కుమార్‌కు     ఫిర్యాదు చేశారు. సోమవారం

Published : 27 Sep 2022 02:08 IST

వాలంటీర్లపై ఎమ్మెల్యే స్వామి ఫిర్యాదు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ‘‘ఓటరు జాబితాకు ఆధార్‌ అనుసంధాన ప్రక్రియలో వాలంటీర్ల పాత్ర ఎక్కువగా ఉంది.. కొన్ని చోట్ల అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ అర్హులైన ఓటర్లను తొలగించేలా వ్యవహరిస్తున్నారు’’ అని కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి కలెక్టర్‌ దినేష్‌కుమార్‌కు     ఫిర్యాదు చేశారు. సోమవారం సాయంత్రం ఆయన కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై చర్చించారు. పొన్నలూరు మండలాన్ని పొదిలి ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌లో విలీనం చేయడం వల్ల దూరం ఎక్కువగా ఉందన్నారు. మండల వాసులకు భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురవుతాయని.. కొండపి ప్రాజెక్ట్‌లోనే ఉంచాలని కోరారు. ఇసుక మాఫియా ఎక్కువగా ఉందని.. అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యలపై వినతిపత్రం అందజేశారు.

* కొండపి నియోజకవర్గంలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలపై జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌కు ఎమ్మెల్యే వివరించారు. ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీని కలిశారు. శాంతిభద్రతల పరిరక్షణకు మరింత మెరుగ్గా పనిచేయాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు