logo

స్పందన అర్జీలను త్వరితంగా పరిష్కరించాలి

‘రెవెన్యూ, పారిశుద్ధ్య సమస్యలపై స్పందనలో ఎక్కువగా అర్జీలు వస్తున్నాయి.. వాటి పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి’ అని సంయుక్త కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రం ఒంగోలులోని ప్రకాశం భవన్‌ స్పందన సమావేశ మందిరంలో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు.

Published : 27 Sep 2022 02:08 IST

గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు, రవాణాపై చేసిన ఫిర్యాదు ప్రతులను చూపుతున్న తెదేపా నాయకులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ‘రెవెన్యూ, పారిశుద్ధ్య సమస్యలపై స్పందనలో ఎక్కువగా అర్జీలు వస్తున్నాయి.. వాటి పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి’ అని సంయుక్త కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రం ఒంగోలులోని ప్రకాశం భవన్‌ స్పందన సమావేశ మందిరంలో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జేసీ మాట్లాడుతూ.. స్పందన అర్జీలు త్వరితగతిన పరిష్కరించాలన్నారు. కోర్టుల్లోని పెండింగ్‌ కేసులకు ఎప్పటికప్పుడు కౌంటర్‌ సమర్పించాలని ఆదేశించారు. జిల్లా స్థాయి అధికారులు ఆన్‌లైన్‌లో వాటిని రెగ్యులర్‌గా పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు. స్పందనలో వచ్చిన అర్జీలపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో జేసీ అభిషిక్త్‌ కిషోర్‌ మాట్లాడి పరిష్కారానికి దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో డీఆర్వో ఓబులేసు, ఎస్‌డీసీ నారదమునితోపాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

* ఒంగోలు మండలం యరజర్ల గ్రామ సమీపంలోని కొండ పోరంబోకు భూముల్లో కొందరు వ్యక్తులు అక్రమంగా గ్రావెల్‌ తవ్వకాలు సాగిస్తున్నారని తెదేపా నాయకులు డీఆర్వో ఓబులేసుకు వినతిపత్రం అందజేశారు. ఇంటి పట్టాలిచ్చేందుకు గతంలో రూ.36 కోట్లతో కొండ ప్రాంతాన్ని చదును చేశారని.. దీనిపై ప్రస్తుతం కోర్టు స్టే ఉందని వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా రెండు నెలల నుంచి గ్రావెల్‌ తరలించి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు.

* ఒంగోలు నగరంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండటంతో చిన్నపాటి వర్షం పడినా రహదారులపై రాకపోకలకు ఇబ్బందికరంగా ఉంటోందని తెదేపా నగర అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు, యరజర్ల ఎంపీటీసీ సభ్యుడు గుండపనేని శ్రీనివాసులు, నాయకులు పసుమర్తి హగయ్యరాజ్‌, గోగినేని రామారావు, టి.రవితేజ తదితరులు డీఆర్వోకు విన్నవించారు. మురుగు కాలువల్లో పూడిక తీత పనులు సక్రమంగా చేయకపోవడంతో వ్యాధులు ప్రబలుతున్నాయని.. తక్షణమే ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలని కోరారు. పారిశుద్ధ్య పనులు మెరుగుపరచాలన్నారు.  

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని