logo

బాలాత్రిపురసుందరీ నమోస్తుతే

 త్రిపురాంతకం గ్రామీణం, న్యూస్‌టుడే: త్రిపురాంతకం బాలాత్రిపురసుందరీదేవి, త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలకు సోమవారం దేవస్థానం శ్రీకారం చుట్టింది. ఈక్రమంలో రెండు ఆలయాల్లో అంకురార్పణ ఘట్టం నిర్వహించారు. మట్టిని నవపాలికల్లో నింపి నవధాన్యాలను అర్చకులు అంకురింపజేశారు.

Published : 27 Sep 2022 02:08 IST

బాలాత్రిపురసుందరీదేవి అలంకారంలో అమ్మవారు

త్రిపురాంతకం గ్రామీణం, న్యూస్‌టుడే:  త్రిపురాంతకం గ్రామీణం, న్యూస్‌టుడే: త్రిపురాంతకం బాలాత్రిపురసుందరీదేవి, త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలకు సోమవారం దేవస్థానం శ్రీకారం చుట్టింది. ఈక్రమంలో రెండు ఆలయాల్లో అంకురార్పణ ఘట్టం నిర్వహించారు. మట్టిని నవపాలికల్లో నింపి నవధాన్యాలను అర్చకులు అంకురింపజేశారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు అభిషేకం, కాలపూజ, బాలభోగం, గణపతి పూజ, అఖండ స్థాపన, మండపారాధన, అష్టదిక్పాలక పూజ, పారాయణం నిర్వహించారు. మంత్రులు ఆదిమూలపు సురేష్‌, రోజా, అంజాద్‌ బాషా, బూచేపల్లి వెంకాయమ్మ తదితరులు త్రిపురాంతకేశ్వర స్వామిని దర్శించుకుని అభిషేక పూజలు నిర్వహించారు. బాలాత్రిపురసుందరీదేవి ఆలయంలో శ్రీచక్ర పూజలు చేశారు. శరన్నవ రాత్రుల సందర్భంగా మంత్రులు బాలాత్రిపురసుందరీదేవి అమ్మ వారికి, త్రిపురాంబ దేవికి పట్టు వస్త్రాలను సమర్పించారు.ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి, పాలకమండలి సభ్యులు, అర్చకులు మంత్రులకు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. త్రిపురాంతకం బాలాత్రిపురసుందరీదేవి అమ్మవారు మొదటి రోజు పద్మవాహనం పై దర్శనమిచ్చారు. అమ్మవారిని బాలాత్రిపురసుందరీదేవిగా అలంకరించి రాత్రి ఉభయదాతలతో కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణ, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో ఉరేగించారు.

పట్టు వస్త్రాలతో ఆలయంలో ప్రదక్షిణలు చేస్తున్న మంత్రులు సురేష్‌, రోజా, అంజాద్‌ బాషా, జడ్పీ ఛైర్‌ పర్సన్‌ వెంకాయమ్మ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని