logo

ధరలు పెంచి నడ్డి విరుస్తున్నారు

ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు చరమ గీతం పాడేందుకు సిద్ధం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సీపీఎం నిర్వహిస్తున్న ‘దేశ రక్షణ భేరి’ కార్యక్రమంలో

Published : 28 Sep 2022 02:25 IST

‘దేశ రక్షణ భేరి’ సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి

మాట్లాడుతున్న వి.శ్రీనివాసరావు.. వేదికపై సీపీఎం నాయకులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు చరమ గీతం పాడేందుకు సిద్ధం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సీపీఎం నిర్వహిస్తున్న ‘దేశ రక్షణ భేరి’ కార్యక్రమంలో భాగంగా ఒంగోలులోని అద్దంకి బస్టాండ్‌ సెంటర్‌లో మంగళవారం బహిరంగ సభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మోదీ ఎనిమిదేళ్ల పాలనలో ధరల పెంపు, నిరుద్యోగం, రైతు వ్యతిరేక విధానాలు తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోలేదన్నారు. వెనుకబడిన ప్రకాశం జిల్లాకు ఇస్తామన్న రామాయపట్నం పోర్టు.. జిల్లా మూడు ముక్కలైనా ఒక కొలిక్కి రాలేదన్నారు. రాష్ట్రానికి అన్ని రకాలుగా అన్యాయం జరుగుతున్నా అధికార వైకాపా, ప్రతిపక్ష తెదేపా ప్రశ్నించడం లేదన్నారు. రాష్ట్రంలో ఓ చేత్తో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, మరో చేత్తో ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌, వైఎస్సార్‌ కీర్తిని దెబ్బతీసేలా పాలక, ప్రతిపక్షాల చేష్టలు ఉన్నాయన్నారు. సభలో సీపీఎం జిల్లా కార్యదర్శి సయ్యద్‌ హనీఫ్‌, నాయకులు పి.ఆంజనేయులు, జాలా అంజయ్య, జీవీ కొండారెడ్డి, ఎస్‌కె.మాబు, చీకటి శ్రీనివాసరావు, కె.ఆంజనేయులు, జి.రమేష్‌, కె.రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు