logo

లోక్‌ అదాలత్‌ విజయవంతానికి సమావేశం

జాతీయ న్యాయ సేవాధికార సంస్థ నిర్దేశం మేరకు నవంబర్‌ 12న జిల్లా వ్యాప్తంగా నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌ విజయవంతానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి ఒంగోలు నగరపాలక సంస్థ అధికారులతో మంగళవారం

Published : 28 Sep 2022 02:23 IST

మున్సిపల్‌ అధికారులతో సమావేశమైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతి

ఒంగోలు న్యాయవిభాగం, న్యూస్‌టుడే: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ నిర్దేశం మేరకు నవంబర్‌ 12న జిల్లా వ్యాప్తంగా నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌ విజయవంతానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి ఒంగోలు నగరపాలక సంస్థ అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. లోక్‌ అదాలత్‌లో నగరపాలక సంస్థకు సంబంధించిన వివాదాలతో పాటు అన్ని రకాల సివిల్‌ కేసులు, రాజీ పడదగిన క్రిమినల్‌ కేసులు, కుటుంబ సంబంధిత, ఆర్థిక లావాదేవీల వివాదాలు, చెల్లని చెక్కు, మోటారు వాహన ప్రమాద పరిహారం, పీఎల్‌సీ కేసుల పరిష్కారానికి శ్రద్ధ చూపాలని సూచించారు. కేసుల్లోని ఇరువర్గాల కక్షిదారుల మధ్య సయోధ్య కుదర్చి పరిష్కారానికి న్యాయమూర్తులు, న్యాయవాదులతో బెంచ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.శ్యాంబాబు, మున్సిపల్‌ రెవెన్యూ అధికారులు మధు, భాస్కర్‌, శానిటరీ సూపర్‌వైజర్‌ పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని