logo

సామాజిక వివక్షపై పోరాడిన వ్యక్తి జాషువా

కలమే ఆయుధంగా సామాజిక వివక్షపై పోరాడిన గుర్రం జాషువా విలువలు అందరికీ ఆదర్శమని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ అన్నారు. సాహిత్య, సాంస్కృతిక సేవా సమితి

Published : 29 Sep 2022 02:30 IST

గుర్రం జాషువా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, సంయుక్త
కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ తదితరులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: కలమే ఆయుధంగా సామాజిక వివక్షపై పోరాడిన గుర్రం జాషువా విలువలు అందరికీ ఆదర్శమని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ అన్నారు. సాహిత్య, సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఆవరణలో బుధవారం గుర్రం జాషువా జయంతి వేడుకలు నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ సమాజ ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చేలా గొప్ప రచనలు చేశారని కొనియాడారు. సంయుక్త కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ మాట్లాడుతూ సమాజంలో మార్పు కోసం మరింతమంది సాహితీవేత్తలు ముందుకు వచ్చేలా ‘గబ్బిలం’ రచన ద్వారా జాషువా నాంది పలికారన్నారు. కార్యక్రమంలో డీఆర్వో ఓబులేసు, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి లక్ష్మానాయక్‌, డీఎస్పీ నాగరాజు, సేవా సమితి అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య, జాషువా మనుమరాలు జి.యామిని తదితరులు పాల్గొన్నారు. తొలుత జాషువా చిత్రపటానికి అధికారులు పూలమాల వేసి నివాళులర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని