logo

నిధులివ్వకుండా పనులు ఎలా చేస్తాం?

గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవసరమైన ఆర్థిక సంఘం నిధులు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ మద్దిపాడు మండల సర్పంచులు బుధవారం ధర్నా నిర్వహించారు.

Published : 29 Sep 2022 02:30 IST

సర్పంచుల ధర్నా

మద్దిపాడు ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ధర్నా చేస్తున్న సర్పంచులు

మద్దిపాడు, న్యూస్‌టుడే: గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవసరమైన ఆర్థిక సంఘం నిధులు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ మద్దిపాడు మండల సర్పంచులు బుధవారం ధర్నా నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీరామమూర్తి మాట్లాడుతూ 14వ ఆర్థిక సంఘం నిధులు ఇచ్చి వెంటనే వెనక్కు తీసుకున్నారన్నారు. ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం నిధులు సెప్టెంబరు దాటినా జమ కాలేదన్నారు. నిత్యం పారిశుద్ధ్య పనులు చేయాలంటూ చెబుతున్నారని.. నిధులు లేకపోతే ఎలా చేయగలరని ప్రశ్నించారు. సర్పంచులంతా నినాదాలు చేస్తూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. తాము ఎన్నికై రెండేళ్లు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోలేకపోయామన్నారు. సర్పంచులకు రూ.15 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సర్పంచులు వెంకటేశ్వర్లు, సుబ్బారెడ్డి, వెంకట్రావు, సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని