logo

విపత్తుల సన్నద్ధతపై సమీక్ష

తుపాను విపత్తులను ఎదుర్కొనేందుకు యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ సూచించారు. ఈ మేరకు జిల్లా, మండల స్థాయి అధికారులతో బుధవారం

Published : 29 Sep 2022 02:30 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, చిత్రంలో జేసీ అభిషిక్త్‌ కిషోర్‌, ఏఎస్పీ నాగేశ్వరరావు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టడే: తుపాను విపత్తులను ఎదుర్కొనేందుకు యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ సూచించారు. ఈ మేరకు జిల్లా, మండల స్థాయి అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. తీర ప్రాంత మండలాలైన నాగులుప్పలపాడు, ఒంగోలు, కొత్తపట్నం, టంగుటూరు, సింగరాయకొండ మండలాల అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించుకుని... ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. తుపాను పునరావస కేంద్రాలతో పాటు... ఇతర ప్రభుత్వ భవనాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. విద్యుత్తు, సమాచార వ్యవస్థకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విపత్తు సమయంలో ఆహారం, తాగునీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా... ఇప్పటి నుంచే దృష్టి సారించి బఫర్‌ స్టాక్‌ ఉంచుకోవాలన్నారు. సమావేశంలో జేసీ అభిషిక్త్‌ కిషోర్‌, ఏఎస్పీ నాగేశ్వరరావు, డీఆర్వో ఓబులేసు, జడ్పీ సీఈవో జాలిరెడ్డి, డీపీవో నారాయణరెడ్డి, జిల్లా మత్స్యశాఖ అధికారి చంద్రశేఖర్‌ రెడ్డి, పశుసంవర్థక శాఖ అధికారిణి డాక్టర్‌ బేబీరాణి పాల్గొన్నారు.

కాలానుగుణ వ్యాధులపై అప్రమత్తం
ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: వచ్చే మూడు నెలలు జిల్లా అంతటా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎస్‌.రాజ్యలక్ష్మి ఆదేశించారు. తన కార్యాలయం నుంచి వైద్యాధికారులతో బుధవారం నిర్వహించిన జూమ్‌ సమావేశంలో మాట్లాడారు. కాలానుగుణ వ్యాధులు ప్రబలకుండా అవసరం మేరకు మందులు సిద్ధం చేసుకోవాలన్నారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుని... వైద్యశాలల్లోనే కాన్పులు చేయించాలన్నారు. సిబ్బంది మొత్తం కొవిడ్‌ బూస్టర్‌ డోస్‌ టీకాలు వేయించుకోవాలన్నారు.  కార్యక్రమంలో ఆర్‌బీఎస్‌కే సమన్వయకర్త డాక్టర్‌ భగీరథి, డీపీఎంవో టి.వాణిశ్రీ, ఇమ్యునైజేషన్‌ అధికారి పద్మజ, సుగుణమ్మ, చల్లా ప్రభాకరరెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని