logo

విద్యుదాఘాతంతో మహిళ మృతి

గిద్దలూరు నగర పంచాయతీ పిడతల రాంభూపాల్‌రెడ్డి కాలనీలో బుధవారం విద్యుదాఘాతానికి గురై ఓ మహిళ మృతిచెందిన సంఘటన చోటు చేసుకుంది. బేస్తవారపేట మండలం

Published : 29 Sep 2022 02:30 IST

గిద్దలూరు పట్టణం : గిద్దలూరు నగర పంచాయతీ పిడతల రాంభూపాల్‌రెడ్డి కాలనీలో బుధవారం విద్యుదాఘాతానికి గురై ఓ మహిళ మృతిచెందిన సంఘటన చోటు చేసుకుంది. బేస్తవారపేట మండలం బసినపల్లె గ్రామానికి చెందిన పూజల ఆంజనేయులు, ఆయన సతీమణి మహాలక్ష్మి(30) కుమారుడు, కుమార్తెతో కలసి గిద్దలూరు పిడతల రాంభూపాల్‌రెడ్డి కాలనీలో ఓ అద్దె గృహంలో నివాసముంటున్నారు. గేదెలు మేపుతూ పాలు విక్రయించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం సాయంత్రం మహాలక్ష్మి గేదెల కోసం వేసిన గడ్డివాము వద్ద పంది ఈతలు ఈని ఉండటం గమనించి దానిని తరిమి వేసేందుకు సమీపంలోని ఓ ఇంటి మిద్దె ఎక్కి వాటిని తోలి కిందికి దిగింది. ఆ సమయంలో మిద్దెపై ఉన్న ఇనుప గ్రిల్‌కు విద్యుత్తు సరఫరా కావడంతో ఆమె విద్యుదాఘాతానికి గురైంది.  స్థానికులు వెంటనే ఆమెను గిద్దలూరు లోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరిశీలించి ఆమె మృతిచెందినట్లు తెలియజేశారు. భార్య మరణంతో చిన్నారులను ఎలా పోషించాలంటూ ఆంజనేయులు విలపించడం చూపరులను కంటనీరు తెప్పించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని