logo

పథకం ప్రకారమే చంపారా?

స్థానిక గంగవరం రోడ్డులో మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మస్తాన్‌ బాషాను కొందరు ప్రణాళిక ప్రకారమే కారుతో ఢీకొట్టి చంపారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ద్విచక్ర

Published : 29 Sep 2022 02:30 IST

దర్శి, న్యూస్‌టుడే: స్థానిక గంగవరం రోడ్డులో మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మస్తాన్‌ బాషాను కొందరు ప్రణాళిక ప్రకారమే కారుతో ఢీకొట్టి చంపారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ద్విచక్ర వాహనంపై వస్తున్న బాషాను వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం వేగంగా ఢీకొట్టడంతో దుర్మరణం పాలైనట్లు పోలీసులు ప్రాథమికంగా భావించారు. అయితే మృతుని కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో కేసు నమోదు చేసిన ఎస్సై రామకృష్ణ దర్యాప్తు ప్రారంభించారు. మృతునికి, అతని బంధువుకు గతంలో ఆస్తి తగాదాలు ఉన్నాయని, ఈ గొడవల విషయంలో గతంలోనే మస్తాన్‌ బాషా ఫిర్యాదుతో సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి, జైలులో పెట్టినట్లు సమాచారం. దీంతో కక్షపూరితంగా మంగళవారం కారుతో ఢీకొట్టి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సదరు వ్యక్తి కూడా ప్రమాదం జరిగినప్పటి నుంచి కనిపించకపోవటం, చరవాణి పనిచేయకపోవటం అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. పట్టణంలోని పలు సీసీ కెమెరాల ద్వారా అతను కారులో వెళ్లినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. బుధవారం పోలీసులు అనుమానితుని కుటుంబసభ్యులను విచారించినట్లు తెలిసింది.

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts