logo

మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకునే యత్నం

వై.పాలెంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి వచ్చిన మంత్రి ఆదిమూలపు సురేష్‌ కాన్వాయ్‌ను కొంతమంది బుధవారం అడ్డుకున్నారు. వైపాలెంలో స్థిరాస్తి వ్యాపారి అచ్యుత

Published : 29 Sep 2022 02:30 IST

హత్యకేసు నిందితుల ఇంటికి వెళ్లి వస్తుండగా ఘటన

మహిళలను నిలువరిస్తున్న పోలీసులు

యర్రగొండపాలెం, న్యూస్‌టుడే: వై.పాలెంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి వచ్చిన మంత్రి ఆదిమూలపు సురేష్‌ కాన్వాయ్‌ను కొంతమంది బుధవారం అడ్డుకున్నారు. వైపాలెంలో స్థిరాస్తి వ్యాపారి అచ్యుత ఆదినారాయణ మార్చిలో హత్యకు గురైన విషయం తెలిసిందే ఈకేసులో నిందితులుగా ఉన్న వ్యక్తుల ఇంటికి మంత్రి వెళ్లి రావడాన్ని బాధిత కుటుంబసభ్యులు ఆక్షేపించారు. దీనిపై బ్యాంకు బజారులో నిరసన వ్యక్తం చేస్తూ మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకోబోయారు. పోలీసులు వారిని వారించి పక్కకు తీసుకెళ్లి వాహనాలను పంపించేశారు. తమకు న్యాయం చేయమని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని బాధితులు ప్రశ్నించారు. ఆదినారాయణ కుటుంబ సభ్యులను పోలీసులు పిలిపించి సమస్య తెలుసుకొని పంపించేశారు. మంత్రికి అర్జీ ఇచ్చేందుకే తాము వచ్చినట్లు వారి తెలిపారని ఎస్సై రామకోటయ్య పేర్కొన్నారు. ఘటన అనంతరం హతుడి కుటుంబసభ్యులు, ఎఫ్‌ఐఆర్‌లో పేర్లు ఉన్న వారి కుటుంబసభ్యులు పరస్పరం దూషించుకోవడంతో గొడవలు జరక్కుండా పోలీసులు సర్దిచెప్పి అక్కడినుంచి పంపించేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని