logo

ప్రభుత్వ భవనాల పనులపై సమీక్ష

గ్రామాల్లో ప్రభుత్వ ప్రాధాన్య భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్‌ దినేష్‌కుమార్‌కు సూచించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో గురువారం వీక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా

Published : 30 Sep 2022 06:39 IST

సమావేశంలో పాల్గొన్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, ఎస్పీ మలికా గార్గ్‌, జేసీ అభిషిక్త్‌ కిషోర్‌

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: గ్రామాల్లో ప్రభుత్వ ప్రాధాన్య భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్‌ దినేష్‌కుమార్‌కు సూచించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో గురువారం వీక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ-పంట పక్కాగా నిర్వహించడంతోపాటు, అక్టోబర్‌ 21 నాటికి సామాజిక తనిఖీలు పూర్తి చేయాలన్నారు. అదే నెల 28 నాటికి ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను కూడా ముగించాలని సూచించారు. ఉపాధి హామీ కూలీలకు రోజువారీ కూలి ధర పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లబ్ధిదారులకు బిల్లులను వెంటనే చెల్లిస్తున్నందున జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా పర్యవేక్షించాలన్నారు. స్పందన అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దన్నారు. సమావేశంలో ఎస్పీ మలికా గార్గ్‌, జేసీ అభిషిక్త్‌ కిషోర్‌, డీఆర్వో ఓబులేసు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని