logo

మింగేసిన కాలువ

ప్రమాదవశాత్తు సాగర్‌ కాలువలో పడి ఓ బాలుడు మృతి చెందగా కాపాడబోయి మరో వ్యక్తి గల్లంతయ్యారు. ఈ సంఘటన త్రిపురాంతకం మండల కేంద్రంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. చెర్లోపల్లి గ్రామానికి చెందిన

Published : 30 Sep 2022 06:39 IST

‌ జారిపడి బాలుడి మృతి.. రక్షించబోయి మరో వ్యక్తి గల్లంతు

బాలుడి మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు

త్రిపురాంతకం, న్యూస్‌టుడే: ప్రమాదవశాత్తు సాగర్‌ కాలువలో పడి ఓ బాలుడు మృతి చెందగా కాపాడబోయి మరో వ్యక్తి గల్లంతయ్యారు. ఈ సంఘటన త్రిపురాంతకం మండల కేంద్రంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. చెర్లోపల్లి గ్రామానికి చెందిన కాకర్ల సూరయ్యకు ఇద్దరు పిల్లలు. గురువారం సూరయ్య, ఆయన కుమారుడు వెంకటేశ్వర్లు (15)తో పాటు అలగముతక చిన వెంకటరావు పొలం పనులకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో కాళ్లు శుభ్రం చేసుకునేందుకు సాగర్‌ ప్రధాన కాలువలో దిగారు. బాలుడు జారిపడగా కాపాడేందుకు చిన వెంకటరావు దూకారు. ఇరువురూ గల్లంతయ్యారు. గ్రామస్థులు సంఘటనా స్థలంలో గాలించగా బాలుడి మృతదేహం లభ్యమైంది. చిన వెంకటరావు ఆచూకీ తెలియలేదు. స్థానిక ఎస్సై వెంకట సైదులు వద్ద ప్రస్తావించగా సంఘటనపై సమాచారం అందిందని, బాధితుల నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు. మేడపిలో చదువుకుంటూ దసరా సెలవులకు ఇంటికి వచ్చిన వెంకటేశ్వర్లు ఇక లేడన్న సమాచారంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. గల్లంతైన వెంకటరావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని