logo

ఆరోగ్యకర అలవాట్లతో గుండె భద్రం

ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ఒంగోలులోని ప్రభుత్వ వైద్య కళాశాల, నర్సింగ్‌ విద్యార్థులు గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. కళాశాల నుంచి నెల్లూరు బస్టాండ్‌ వరకు ఇది సాగింది. ఈ సందర్భంగా గుండె సంబంధిత వ్యాధులపై చైతన్యం కల్పించారు

Published : 30 Sep 2022 06:39 IST

న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం

అవగాహన ర్యాలీలో పాల్గొన్న వైద్యులు, విద్యార్థులు

ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ఒంగోలులోని ప్రభుత్వ వైద్య కళాశాల, నర్సింగ్‌ విద్యార్థులు గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. కళాశాల నుంచి నెల్లూరు బస్టాండ్‌ వరకు ఇది సాగింది. ఈ సందర్భంగా గుండె సంబంధిత వ్యాధులపై చైతన్యం కల్పించారు. కళాశాల పర్యవేక్షకులు భగవాన్‌ నాయక్‌, వైద్యులు వెంకటేశ్వరరావు, తిరుమలరావు, ఉప ప్రధానాచార్యులు వెంకట రమణ, నర్సింగ్‌ కళాశాల ప్రధానాచార్యులు సుగంధి తదితరులు పాల్గొన్నారు. ప్రిన్సిపల్‌ మాట్లాడుతూ ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా గుండె వ్యాధులు వస్తున్నాయన్నారు. ఆహార నియమాలు పాటించాలని, వ్యాయామం చేయాలని సూచించారు. ధూమపానం, మద్యానికి దూరంగా ఉండాలన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని