logo

త్వరితగతిన భూ సేకరణ పరిహారం అందజేయాలి

భూ సేకరణ పనులకు సంబంధించి నష్టపరిహారాన్ని త్వరితగతిన అందజేయాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రం ఒంగోలు ప్రకాశం భవన్‌లోని కలెక్టర్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో సంబంధిత అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

Published : 02 Oct 2022 04:37 IST

భూ సేకరణపై సమీక్షా సమావేశానికి హాజరైన అధికారులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: భూ సేకరణ పనులకు సంబంధించి నష్టపరిహారాన్ని త్వరితగతిన అందజేయాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రం ఒంగోలు ప్రకాశం భవన్‌లోని కలెక్టర్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో సంబంధిత అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతీయ రహదారులు 216, 565, 544(డి); 167(బి), బెంగళూరు- విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ హైవే; గుంటూరు- గుంతకల్లు, నడికుడి- శ్రీకాళహస్తి రైల్వేలైన్ల విస్తరణ కోసం భూ సేకరణ పనులకు సంబంధించి నష్టపరిహారం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఎలాంటి వివాదాలు లేకుండా ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడంతో పాటు, కోర్టు కేసుల పరిష్కారంపై ఆరా తీశారు. సమావేశంలో డీఆర్వో ఓబులేసు, భూ సేకరణ విభాగం ప్రత్యేక కలెక్టర్‌ సరళా వందనం, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ గ్లోరియా, ఒంగోలు, మార్కాపురం, కనిగిరి ఆర్డీవోలు విశ్వేశ్వరరావు, లక్ష్మీశివజ్యోతి, సందీప్‌కుమార్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని