logo

జోరువానలోనూ దీక్ష

ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఉన్న ఎన్టీఆర్‌ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ శనివారం వెలిగండ్ల మండల తెదేపా నాయకులు రెండోరోజూ నిరాహార దీక్ష చేపట్టారు. కనిగిరి పట్టణంలోని అమరావతి మైదానం ఎదుట జోరు వానలోనూ దీనిని కొనసాగించారు.

Updated : 02 Oct 2022 05:42 IST

నిరాహార దీక్ష చేస్తున్న వెలిగండ్ల తెదేపా నాయకులు

కనిగిరి: ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఉన్న ఎన్టీఆర్‌ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ శనివారం వెలిగండ్ల మండల తెదేపా నాయకులు రెండోరోజూ నిరాహార దీక్ష చేపట్టారు. కనిగిరి పట్టణంలోని అమరావతి మైదానం ఎదుట జోరు వానలోనూ దీనిని కొనసాగించారు. తెలుగు రైతు నియోజవర్గ అధ్యక్షులు కేలం ఇంద్రభూపాల్‌రెడ్డి, వెలిగండ్ల మండల పార్టీ అధ్యక్షులు ముత్తిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్‌ పేరు మీద ఉన్న వర్సిటీ పేరు మార్చడం అత్యంత దుర్మార్గమన్నారు. మూడేళ్ల వైకాపా పాలనలో ఒక్క అభివృద్ది పని కూడా చేయకపోగా ఎన్టీఆర్‌, చంద్రబాబునాయుడు హయాంలో నిర్మించిన పథకాలకు, నిర్మాణాలకు పేర్లు మార్చి తుగ్లక్‌లా ముఖ్యమంత్రి జగన్‌ వ్యవహరిస్తున్నారన్నారు. ఇలాంటి వ్యతిరేక పనులు చేస్తే ఎవరూ హర్షించరన్నారు. తెదేపా సీనియర్‌ నేతలు శ్యామల కాశిరెడ్డి, తెలుగు రైతు మండల అధ్యక్షులు ఎం.కాశయ్య, తెలుగు యువత అధ్యక్షులు కర్నాటి భాస్కర్‌రెడ్డి, నాయకులు కేసరి రమణారెడ్డి, గాజుల వెంకటేశ్వర్లు, కసుమూరి మౌలాలి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని