logo

అంగన్‌వాడీ పోస్టు వేలంపై ఆరా

ఎం.నిడమానూరులో తెల్లబాడు అంగన్‌వాడీ కార్యకర్త పోస్టు విషయంలో గందరగోళం చోటుచేసుకున్న నేపథ్యంలో... ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏరియా సూపర్‌వైజర్‌ సత్యవతి గ్రామంలో శనివారం విచారణ చేపట్టారు.

Updated : 02 Oct 2022 05:46 IST

స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్న సూపర్‌వైజర్‌ సత్యవతి

టంగుటూరు, న్యూస్‌టుడే: ఎం.నిడమానూరులో తెల్లబాడు అంగన్‌వాడీ కార్యకర్త పోస్టు విషయంలో గందరగోళం చోటుచేసుకున్న నేపథ్యంలో... ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏరియా సూపర్‌వైజర్‌ సత్యవతి గ్రామంలో శనివారం విచారణ చేపట్టారు. స్థానికంగా ఉన్న 154వ అంగన్‌వాడీ కేంద్రంలో సహాయకురాలిగా విధులు నిర్వహిస్తున్న తాటితోటి శిరీష... అదే పరిధిలోని తెల్లబాడుకాలనీలోని 152వ కేంద్రం కార్యకర్త పోస్టుకు తనను ప్రమోట్‌ చేయాలని అర్జీ పెట్టుకున్నారు. కాగా... అదే పోస్టుకు మరికొందరు స్థానికులు పోటీపడ్డారు. ఈ నేపథ్యంలో కొందరు... ఆ పోస్టుకు వేలం నిర్వహించి రూ.5 లక్షలకు ఖరారు చేశారు. విషయం బయటకు పొక్కడంతో... అధికారులు ఆరా తీసి భర్తీ ప్రక్రియను పెండింగ్‌లో ఉంచారు. ఈ నేపథ్యంలో శిరీష... తన భర్త సాయంతో స్పందన ద్వారా కలెక్టర్‌కు విషయాన్ని వివరించారు. ఈ క్రమంలో సూపర్‌ వైజర్‌ విచారణకు వచ్చారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని సూపర్‌వైజర్‌ తెలిపారు.

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts