logo

వయో వృద్ధుల సంక్షేమానికి ప్రాధాన్యం

వయో వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు. వయో వృద్ధుల దినోత్సవాన్ని జిల్లా విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం ఒంగోలు ప్రకాశం భవన్‌లోని స్పందన సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు.

Updated : 02 Oct 2022 05:47 IST

వృద్ధులను సన్మానిస్తున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌.. చిత్రంలో జిల్లా అధికారులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: వయో వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు. వయో వృద్ధుల దినోత్సవాన్ని జిల్లా విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం ఒంగోలు ప్రకాశం భవన్‌లోని స్పందన సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వయో వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న చట్టాలను వివరించారు. ప్రధానంగా సీనియర్‌ సిటిజన్స్‌ తమ అనుభవాలు, ఆలోచనలను యువకులకు తెలియజేయాలని కోరారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్యాంబాబు మాట్లాడుతూ.. భవిష్యత్‌లో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే వయో వృద్ధులు తమ ఆస్తులను కుమారులకు చట్టపరంగా అందించాలని సూచించారు. అనంతరం వివిధ రంగాల్లో రాణించిన వయో వృద్ధులను కలెక్టర్‌ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీఆర్వో ఓబులేసు, డీఆర్డీఏ పీడీ బాబూరావు, డీఎంహెచ్‌వో రాజ్యలక్ష్మి, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడీ అర్చన తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని