logo

పొలం గట్ల వెంట వయ్యారిభామ వద్దు

పైర్ల పొలాల గట్ల వెంట ఉండే వయ్యారి భామ మొక్కలను తొలగించడంతో పాటు పలు రకాల సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా తెగుళ్లను నివారించుకోవచ్చని జిల్లా వనరుల కేంద్రం ప్రాజెక్టు డైరెక్టర్‌ అన్నపూర్ణ రైతులకు సూచించారు.

Published : 02 Oct 2022 04:37 IST

యర్రగొండపాలెం : పత్తి పంటను పరిశీలిస్తున్న వ్యవసాయాధికారులు

త్రిపురాంతకం గ్రామీణం, యర్రగొండపాలెం, న్యూస్‌టుడే: పైర్ల పొలాల గట్ల వెంట ఉండే వయ్యారి భామ మొక్కలను తొలగించడంతో పాటు పలు రకాల సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా తెగుళ్లను నివారించుకోవచ్చని జిల్లా వనరుల కేంద్రం ప్రాజెక్టు డైరెక్టర్‌ అన్నపూర్ణ రైతులకు సూచించారు. త్రిపురాంతకం మండలంలోని మిట్టపాలెం, రామసముద్రం, యర్రగొండపాలెంలో సాగు చేసిన పత్తి, మిర్చి పైర్లను ఆమె శనివారం పరిశీలించారు. ఈ పంటలకు సోకిన తెగుళ్లను పరిశీలించి వాటి నివారణకు అవసరమైన సూచనలు చేశారు. పంట వేసిన 80రోజుల దాకా సింథటిక్‌ పైరిత్రోయిడ్స్‌ వాడొద్దన్నారు. రసంపీల్చే పురుగుల నివారణకు అసిఫేట్‌ పిచికారీ చేయాలని రైతులకు వివరించారు. డీఆర్‌సీ ఏవో శేషమ్మ, ఏవో వెంకటేశ్వర్లు, చైతన్య పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని