logo

అక్కడ ఉత్సవాలు.. ఇక్కడ ట్రాఫిక్‌ మళ్లింపు

విజయవాడ కనకదుర్గమ్మ శరన్నవరాత్రుల ఉత్సవాల రీత్యా 16వ నంబరు జాతీయ రహదారిపై ఒంగోలు వద్ద వాహనాలను పోలీసులు దారి మళ్లించారు. కేవలం ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆర్టీసీ బస్సులను మాత్రమే విజయవాడ వైపు అనుమతించారు.

Published : 03 Oct 2022 02:21 IST

త్రోవగుంట సర్వీసు రోడ్డు వద్ద నిలిచిపోయిన వాహనాలు

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: విజయవాడ కనకదుర్గమ్మ శరన్నవరాత్రుల ఉత్సవాల రీత్యా 16వ నంబరు జాతీయ రహదారిపై ఒంగోలు వద్ద వాహనాలను పోలీసులు దారి మళ్లించారు. కేవలం ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆర్టీసీ బస్సులను మాత్రమే విజయవాడ వైపు అనుమతించారు. మిగిలినవాటిని ఒంగోలు త్రోవగుంట పై వంతెన కింద సర్వీసురోడ్డు నుంచి చీరాల, బాపట్ల, భట్టిప్రోలు, రేపల్లె మీదుగా కృష్ణా జిల్లాలోకి మళ్లించారు. విజయవాడలో బెంజి సర్కిల్‌, దుర్గగుడి పై వంతెనలు ఉన్నాయి. ఆ నగరంలో ఏ స్థాయి ఉత్సవాలు జరిగినా రాజమహేంద్రవరం, హైదరాబాద్‌ మార్లాల్లో వెళ్లే వాహనాలు ఈ పై వంతెనల మీదుగా సులభంగా వెళ్లే అవకాశం ఉంది. అయితే శనివారం అర్ధరాత్రి నుంచి విజయవాడకు సుమారు 130 కిలోమీటర్ల దూరంలోని ఒంగోలు నుంచి వాహనాలను దారి మళ్లించడంతో వాహనదారులు ఆవేదన వ్యక్తంచేశారు. అక్కడి ఉత్సవాల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము ట్రాఫిక్‌ను మళ్లించినట్లు ఒంగోలు డీఎస్పీ యు.నాగరాజు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని