logo

ఎకో టూరిజంలో పర్యాటకుల సందడి

నల్లమల అటవీ ప్రాంతంలోని తుమ్మలబైలు సమీపంలో ఉన్న ఎకోటూరిజంలో మంగళవారం పర్యాటకులు సందడి చేశారు. రెండు నెలల విరామం తర్వాత పునఃప్రారంభించడంతో పర్యాటకుల రాక మొదలైంది.

Published : 05 Oct 2022 04:51 IST

జంగిల్‌ సఫారీలో బాణం సంధిస్తున్న పీసీసీఎఫ్‌ సుమన్‌

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే: నల్లమల అటవీ ప్రాంతంలోని తుమ్మలబైలు సమీపంలో ఉన్న ఎకోటూరిజంలో మంగళవారం పర్యాటకులు సందడి చేశారు. రెండు నెలల విరామం తర్వాత పునఃప్రారంభించడంతో పర్యాటకుల రాక మొదలైంది. విజయదశమి సెలవులు కావడంతో పాటు శ్రీశైలంలో జరుగుతున్న భ్రమరాంబిక దేవి బ్రహ్మోత్సవాలు వీక్షించేందుకు వెళ్లే భక్తులు ఎకోటూరిజాన్ని సందర్శిస్తున్నారు. జిప్సీ వాహనంలో అడవిలో విహరిస్తున్నారు. ఒక్కొక్కరికి టికెట్ రూ.400 చొప్పున వసూలు చేస్తున్నారు. జిప్సీ వాహనంలో ఆరు మందికి అనుమతిస్తారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు రేంజర్‌ విశ్వేశ్వరరావు తెలిపారు.

అభివృద్ధి పనుల పరిశీలన : నల్లమల అటవీ ప్రాంతాన్ని పీసీసీఎఫ్‌(బడ్జెట్) అధికారి ఆర్‌.కె.సుమన్‌ మంగళవారం సందర్శించారు. పెద్దదోర్నాల-శ్రీశైలం రహదారిలోని జంగిల్‌ సఫారీలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూశారు. ప్రస్తుతం రెండు జిప్సీ వాహనాలు ఉన్నాయని మరొకటి కావాలని స్థానిక అటవీ అధికారులు ఆయన దృష్టికి తీసుకుని వెళ్లారు. దీనిపై  ఆయన స్పందిస్తూ త్వరలో వాహనాన్ని కేటాయిస్తామన్నారు. సఫారీ లోని వ్యూ పాయింట్ వాచ్‌టవర్‌ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని అధికారులు కోరారు. అనంతరం ఆయన ఇష్టకామేశ్వరీ ఆలయం ప్రదేశాన్ని సందర్శించారు. ఆయన వెంట మార్కాపురం డివిజన్‌ అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ విఘ్నేష్‌ అప్పావు, రేంజర్‌ విశ్వేశ్వరరావు తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని