logo

అమ్మవారి వేడుకలో జర్మనీ దంపతులు

చిత్రంలో కనినిపిస్తున్నది జర్మనీకి చెందిన మైఖేల్‌, ఎలీనా దంపతులు. సంప్రదాయ వస్త్రధారణలో పామూరులోని వాసవీ కన్యకా పరమేశ్వరిని బుధవారం దర్శించుకుని... అక్కడ నిర్వహించిన మూలమంత్ర హోమం, ఇతర పూజాదికాల్లో పాల్గొన్నారు. 

Updated : 07 Oct 2022 05:27 IST

చిత్రంలో కనినిపిస్తున్నది జర్మనీకి చెందిన మైఖేల్‌, ఎలీనా దంపతులు. సంప్రదాయ వస్త్రధారణలో పామూరులోని వాసవీ కన్యకా పరమేశ్వరిని బుధవారం దర్శించుకుని... అక్కడ నిర్వహించిన మూలమంత్ర హోమం, ఇతర పూజాదికాల్లో పాల్గొన్నారు. పామూరుకు చెందిన చల్లా వెంకటపతి జర్మనీలో ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం ఆయనతో పాటు దంపతులిద్దరూ ఇక్కడకు వచ్చారు. ఆలయ ఛైర్మన్‌ బాలకొండలరావు, కమిటీ ప్రతినిధులు, అర్చకులు... అమ్మవారి శేషవస్త్రాలతో వారిని సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.   

- న్యూస్‌టుడే, పామూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని