logo

రైతులకు బిందు, తుంపర సేద్యం పరికరాలు

2022-23 సంవత్సరానికి బిందు, తుంపర సేద్యానికి అవసరమయ్యే పరికరాల కోసం రైతులు తమ పేర్లను ఆర్‌బీకేల్లో నమోదు చేసుకోవాలని ఏపీఎంఐపీ రాష్ట్ర ప్రాజెక్ట్‌ అధికారి సీబీ.హరినాథ్‌రెడ్డి సూచించారు.

Published : 25 Nov 2022 05:56 IST

సమావేశంలో మాట్లాడుతున్న ఏపీఎంఐపీ రాష్ట్ర ప్రాజెక్ట్‌  అధికారి హరినాథ్‌రెడ్డి..

చిత్రంలో ఇతర అధికారులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: 2022-23 సంవత్సరానికి బిందు, తుంపర సేద్యానికి అవసరమయ్యే పరికరాల కోసం రైతులు తమ పేర్లను ఆర్‌బీకేల్లో నమోదు చేసుకోవాలని ఏపీఎంఐపీ రాష్ట్ర ప్రాజెక్ట్‌ అధికారి సీబీ.హరినాథ్‌రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రం ఒంగోలు కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఆంధ్రప్రదేశ్‌ మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ కింద అమలవుతున్న పథకాలపై సంబంధిత అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరినాథ్‌ రెడ్డి మాట్లాడుతూ.. పట్టాభూమి కలిగిన ఎస్టీలకు కూడా పరికరాలు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ప్రతి కంపెనీ వారికి నిర్దేశించి లక్ష్యాన్ని తప్పకుండా చేయాలని ఆదేశించారు. ఉద్యాన పంటలు సాగు చేసే గ్రామాలను ఎంపిక చేసుకుని మైక్రో ఇరిగేషన్‌ కిందకు తీసుకురావాలని సూచించారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి జీవ సంబంధమైన ఎరువులను వినియోగించడం వలన పంట నాణ్యతతో పాటు, అధిక దిగుబడులు వస్తాయని తెలిపారు. సమావేశంలో ఏపీఎంఐపీ ఓఎస్డీ డి.రమేష్‌, ఏపీఎంఐపీ పీడీ రవీంద్రబాబు, జిల్లా ఉద్యాన అధికారి గోపీచంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని