పునరావాస కాలనీల్లో నిర్మాణాలు పూర్తిచేయండి
వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించిన పునరావాస కాలనీల్లో నిర్మాణాలను సత్వరమే పూర్తి చేయడానికి ఇంజినీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని సంయుక్త కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఆదేశించారు.
అధికారులకు జేసీ ఆదేశాలు
గోగులదిన్నె పునరావాసకాలనీ మ్యాప్‌ను పరిశీలిస్తున్న సంయుక్త కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, అధికారులు
మార్కాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించిన పునరావాస కాలనీల్లో నిర్మాణాలను సత్వరమే పూర్తి చేయడానికి ఇంజినీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని సంయుక్త కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఆదేశించారు. మార్కాపురం మండలంలోని గోగులదిన్నెలో... పెద్దారవీడు మండలం సుంకేసుల ముంపు గ్రామానికి ఏర్పాటుచేసిన పునరావాస కాలనీని శుక్రవారం పరిశీలించారు. క్రీడలు, శ్మశానాలకు స్థలాల కేటాయింపు వెంటనే చేపట్టాలని అధికారులకు సూచించారు. పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నవారి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత వారికి అర్హత కల్పించాలని ఆదేశించారు. ఉప కలెక్టర్ సేతు మాధవన్, వెలిగొండ ప్రాజెక్టు అధికారిణి సరళావందనం, డిప్యూటీ కలెక్టర్ వెంకటస్వామి, అధికారులు పాల్గొన్నారు.
నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి
వెలిగొండ నిర్వాసితుల సంఘం కన్వీనర్ గాలి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వాసితులు జేసీని కలిసి వినతిపత్రం అందజేశారు. గొట్టిపడియ, అక్కచెరువుతండా, సుంకేసుల, కలనూతల, గుండంచెర్ల, కాటంరాజుతండా, చింతముడిపి ముంపు గ్రామాలకు చెందినవారికి నేటికీ పరిహారం మంజూరు చేయలేదని, అర్హుల జాబితాను కూడా సక్రమంగా ప్రకటించలేదని వాపోయారు. అర్హత కలిగిన యువతీ, యువకులకు పరిహారం ఇచ్చేందుకు జాబితాలో చేర్చాలని కోరారు. వేములకోట పరిధి కోమటికుంట సమీప పునరావాస కాలనీల్లో జరుగుతున్న పనులు పూర్తిగా నిలిచిపోయాయని నిర్వాసితులు తెలిపారు. అధికారులు గుత్తేదారు ద్వారా నాసిరకం కంకర తోలించారని..దాంతో పనులు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయన్నారు. స్పందించిన జేసీ ఆ కంకరను మార్పు చేసి మరొకటి వినియోగించాలని ఆదేశించారు. జేసీని కలిసినవారిలో వేల్పుల చెన్నారెడ్డి, బుర్రి చిన వెంకటేశ్వర్లు, బి.సహదేవుడు, షేక్ షర్పీద్దీన్, దుగ్గి వెంకట రమణయ్య, కె.కోటేశ్వరరావు, సుంకేసుల సర్పంచి రమేష్ తదితరులు ఉన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
IND vs AUS: భారత్ X ఆసీస్.. బౌలర్లు ముగించారు.. బ్యాటర్లు ఆరంభించారు..!
-
Politics News
Chandrababu: జగన్‌ను చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది: చంద్రబాబు
-
Movies News
Natti Kumar: కౌన్సిల్ ఒక్కటే ఉండాలి.. ‘దాసరి’పై సినిమా తీయబోతున్నాం.. నట్టి కుమార్
-
World News
Earthquake: ఆ భూకంప ధాటికి.. దేశమే 5మీటర్లు జరిగింది..!
-
India News
Kiren Rijiju: న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లు లేవు : కేంద్రం