logo

ఆక్వా రైతులను దగా చేయొద్దు

ఒంగోలు త్రోవగుంటలోని బృందావన కల్యాణమండపంలో శుక్రవారం నిర్వహించిన ఆక్వా రైతుల సదస్సు ఈ రంగంలో ప్రస్తుతం నెలకొన్న సమస్యలను ఏకరువు పెట్టింది. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల రైతులు, ప్రాసెసింగ్‌ యూనిట్ల ప్రతినిధులు దీనికి హాజరయ్యారు.

Updated : 26 Nov 2022 04:29 IST

సదస్సులో వాడీవేడి చర్చ

చెబుతున్న నెల్లూరు జిల్లాకు చెందిన రైతు వెంకురెడ్డి

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఒంగోలు త్రోవగుంటలోని బృందావన కల్యాణమండపంలో శుక్రవారం నిర్వహించిన ఆక్వా రైతుల సదస్సు ఈ రంగంలో ప్రస్తుతం నెలకొన్న సమస్యలను ఏకరువు పెట్టింది. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల రైతులు, ప్రాసెసింగ్‌ యూనిట్ల ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. సంక్షోభంలో ఉన్న ఆక్వా రంగాన్ని కాపాడాలని రైతులు డిమాండ్‌ చేశారు. కిలో రూ.210 చొప్పున ధరకు కొనుగోలు చేసేలా చూస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. అది ఎక్కడ అమలవుతుందని ప్రశ్నించారు. సాకులు చెబుతూ రైతులను దగా చేస్తున్నారన్నారు. విద్యుత్తు రాయితీలనూ అమలుచేయలేదన్నారు. ‘ఈక్వెడార్‌ నుంచి అమెరికా రొయ్యలు దిగుమతి చేసుకుంది.. చైనాలో కిలోకి 40 తూగే రొయ్యలపై ఆసక్తి చూపుతున్నారు.. ఇటువంటి అంశాలు కూడా ఇక్కడి నుంచి రొయ్యల ఎగుమతులు తగ్గేందుకు ఓ కారణం’ అని రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు అన్నారు. తాము తీసుకునే సుమారు 60 టన్నుల్లో అధికభాగం ప్రకాశం, నెల్లూరు జిల్లాల రైతుల వద్దనే అని దేవీ సీఫుడ్స్‌ ఎండీ బ్రహ్మానందం పేర్కొన్నారు. ఆక్వా ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు రాజశేఖర్‌ మాట్లాడుతూ రైతులు కూడా సాగులో మెలకువలు పాటించాలని, లేకుంటే ఈ సంక్షోభ సమయంలో మరింత నష్టపోతారన్నారు. రైతు నాయకుడు దుగ్గినేని గోపీనాథ్‌, అప్సడా ఉపాధ్యక్షుడు వడ్డే రఘురాం మాట్లాడారు.గురువారం ఆక్వా రైతులతో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఎంపీ ప్రస్తావిస్తుండగా.. సదస్సుకు వచ్చిన రైతులు వెంటనే స్పందించారు. చంద్రబాబు ప్రస్తావించిన సమస్యలు తమకు ఉన్నాయని స్పష్టం చేశారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని