logo

మూడో రైల్వే ట్రాక్‌ పరిశీలన

చినగంజాం నుంచి కరవది వరకు నూతనంగా నిర్మించిన మూడో ట్రాక్‌లో చేపట్టిన ట్రయల్‌ రన్‌ను రైల్వే సీఆర్‌ఎస్‌ అక్షయ కుమార్‌ రాయ్‌ శుక్రవారం పరిశీలించారు.

Published : 26 Nov 2022 02:27 IST

రైల్వే సీఆర్‌ఎస్‌ అక్షయ కుమార్‌ రాయ్‌కు వినతిపత్రం అందజేస్తున్న శ్రీనివాసరావు తదితరులు

నాగులుప్పలపాడు, న్యూస్‌టుడే: చినగంజాం నుంచి కరవది వరకు నూతనంగా నిర్మించిన మూడో ట్రాక్‌లో చేపట్టిన ట్రయల్‌ రన్‌ను రైల్వే సీఆర్‌ఎస్‌ అక్షయ కుమార్‌ రాయ్‌ శుక్రవారం పరిశీలించారు. చినగంజాం నుంచి వచ్చిన ఆయన మధ్యాహ్న సమయానికి అమ్మనబ్రోలు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. స్టేషన్‌ను పరిశీలించి అనంతరం సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు వినతిపత్రాలు అందజేశారు. అమ్మనబ్రోలు రైల్వేస్టేషన్‌లో పినాకిని, సింహపురి, యశ్వంతపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నిలిపేలా చూడాలని కోరారు. అమ్మనబ్రోలు రైల్వే లెవెల్‌ క్రాసింగ్‌ వద్ద ఫ్లైఓవర్‌ నిర్మాణం చేపట్టాలని, సాంకేతిక లోపంతో నిలిచిపోయిన రిజర్వేషన్‌ కౌంటర్‌ను తిరిగి వినియోగంలోకి తేవాలని వినతుల్లో పేర్కొన్నారు. వినతిపత్రాలు అందజేసిన వారిలో మండల కో-ఆప్షన్‌ సభ్యుడు కరీముల్లా, స్వర్ణ అనిల్‌, వైకాపా నాయకుడు కాట్రగడ్డ శ్రీనివాసరావు తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని