పాల ఉత్పత్తి పెంపు... పశు పోషకులకు లబ్ధి
పాల ఉత్పత్తి పెంచడంతో పాటు, పశు పోషకులకు లాభసాటిగా ఉండేలా రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ... రాష్ట్రీయ గోకుల్ మిషన్ సౌజన్యంతో ‘పెయ్యి దూడల ఉత్పత్తి పథకం’ అమలుకు రంగం సిద్ధం చేసింది
ప్రయోగాత్మకంగా 12 మండలాల్లో పెయ్యి దూడల పథకం అమలు
న్యూస్‌టుడే - ఒంగోలు గ్రామీణం
పాల ఉత్పత్తి పెంచడంతో పాటు, పశు పోషకులకు లాభసాటిగా ఉండేలా రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ... రాష్ట్రీయ గోకుల్ మిషన్ సౌజన్యంతో ‘పెయ్యి దూడల ఉత్పత్తి పథకం’ అమలుకు రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం కృత్రిమ గర్బధారణ పద్ధతిలో పుట్టే పెయ్యి దూడల శాతం సగానికి పైగా తగ్గింది. దీంతో పశుపోషణే జీవనాధారమైన పాడి రైతులకు కొంతమేర ఇబ్బంది తలెత్తుతోంది. మరోవైపు క్రమేణా పాల దిగుబడి తగ్గడంతో డెయిరీల నిర్వాహకులకూ సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారం దిశగా లింగ నిర్ధారిత వీర్యం అందించేందుకు పశుసంవర్థకశాఖ కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.
ముందస్తు ఒప్పందం మేరకు...
పెయ్యి దూడల పథకం కింద ఒక్కో రైతుకు రూ.675 చొప్పున ధర కలిగిన లింగ నిర్ధారిత వీర్యాన్ని రెండు పర్యాయాలు సమకూర్చుతారు. మొత్తం విలువ రూ.1,350 కాగా... రూ.850 రాయితీ ఉంటుంది. ఆ మేరకు రైతులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. ఆసక్తి గల పాడి రైతులు ముందస్తు ఒప్పందం చేసుకుని నగదు చెల్లించాలి. ఒకవేళ రెండు పర్యాయాలు వీర్య నాళికలు ఉపయోగించినా పశువు గర్భం దాల్చకపోతే రైతు చెల్లించిన మొత్తం తిరిగి ఇచ్చేస్తారు. మొదటి సారి వినియోగించిన వీర్య నాళిక ద్వారా గర్భం దాల్చిన పశువుకు మగదూడ పుట్టినట్లయితే డబ్బులు తిరిగి చెల్లించరు. కొన్ని పశువులు 21 రోజుల తర్వాత ఎదకు వస్తాయి. దాంతో రెండో సారి వాడిన వీర్య నాళిక ద్వారా కూడా మగదూడ పుడితే రూ.250 తిరిగి ఇవ్వనున్నారు. ఎదకురాని పక్షంలో 90 రోజులకు చూడి నిర్ధారణ పరీక్షలు చేస్తారు. చూడి కాకుంటే రూ.500 తిరిగి ఇస్తారు.
* పథకం లక్ష్యం: ఎదకు వచ్చిన పాడి గేదెలకు లింగ నిర్ధారిత వీర్యం ఇచ్చి 90 శాతం మేలు జాతి పెయ్యి దూడలు ఉత్పత్తి చేయడం. తద్వారా పాల దిగుబడి... పోషకుల ఆదాయం పెంచాలన్నది లక్ష్యం.
* తొలి విడతగా అమలు చేయనున్న మండలాలు: దర్శి, ముండ్లమూరు, తాళ్లూరు, చీమకుర్తి, సంతనూతలపాడు, ఒంగోలు, కొత్తపట్నం, నాగులుప్పలపాడు, టంగుటూరు, కొండపి, పొన్నలూరు, సింగరాయకొండ.
* ఏం చేస్తారు: ఆయా మండలాల్లోని గ్రామాల్లో మేలైన పశు సంపద, ఔత్సాహిక పశు పోషకులను గుర్తిస్తారు. సంపూర్ణ ఆరోగ్యం కలిగి, క్రమం తప్పకుండా ఎదకు వచ్చే కనీసం 40 పశువులను గుర్తిస్తారు. వాటి పోషకులతో ముందస్తు ఒప్పందాలు చేసుకుని లింగ నిర్ధారిత వీర్యంతో పశువులకు చూలు కట్టిస్తారు. మొత్తంగా 2,570 గేదెలకు వీర్యం ఇవ్వాలన్నది లక్ష్యం.
అన్ని మండలాలకూ విస్తరిస్తాం...
పాల ఉత్పత్తి పెంపుదలలో భాగంగా పెయ్యి దూడల పథకంపై గ్రామాల్లోని పాడి రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. జిల్లాలో తొలివిడతగా 12 మండలాలను ఎంపిక చేశాం. ఆసక్తి కలిగిన పశుపోషకులు సమీప పశు వైద్యశాలల్లో సంప్రదించాలి. రెండో విడతలో జిల్లాలోని మిగిలిన మండలాలకు పథకాన్ని విస్తరిస్తాం.
కాలేషా, ఈవో, జిల్లా పశుగణాభివృద్ధి సంఘం
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Remarriage: మాజీ భార్యతో మళ్లీ పెళ్లి ..! ఆ వివాహం వెనక కదిలించే స్టోరీ
-
General News
KTR: సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా భారీ సభ.. జనసమీకరణపై నేతలతో కేటీఆర్ భేటీ
-
Movies News
Social Look: పూజా సీమంతం.. శ్రద్ధాదాస్ హాఫ్‌శారీ.. టీమ్‌తో రాశీఖన్నా!
-
World News
Earthquake: తుర్కియేలో 1100 సార్లు ప్రకంపనలు.. 17వేలు దాటిన మరణాలు
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Sports News
IND vs AUS: భారత్ X ఆసీస్.. బౌలర్లు ముగించారు.. బ్యాటర్లు ఆరంభించారు..!