ఇసుక దందా అడ్డగింత
గుర్తు తెలియని వ్యక్తులు ఓ ప్రముఖ సంస్థ పేరుతో బిల్లులు సృష్టించి ట్రాక్టర్లతో భారీగా ఇసుక తరలించేందుకు ప్రయత్నించగా జరుగుమల్లి గ్రామస్థులు తమ వాహనాలు అడ్డుపెట్టి నిలువరించారు.
జరుగుమల్లి గ్రామస్థులు అడ్డుకొని నిలిపి ఉంచిన ఇసుక ట్రాక్టర్లు
జరుగుమల్లి, న్యూస్‌టుడే: గుర్తు తెలియని వ్యక్తులు ఓ ప్రముఖ సంస్థ పేరుతో బిల్లులు సృష్టించి ట్రాక్టర్లతో భారీగా ఇసుక తరలించేందుకు ప్రయత్నించగా జరుగుమల్లి గ్రామస్థులు తమ వాహనాలు అడ్డుపెట్టి నిలువరించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి వచ్చి విచారణ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. జరుగుమల్లి, చింతలపాలెంలోని ఇసుక రీచ్‌ల్లో శుక్రవారం ఒంగోలుకు చెందిన కొంత మంది 20 ట్రాక్టర్లతో వచ్చారు. ఇన్ని వాహనాలు ఒకేసారి రావడంతో గమనించిన గ్రామస్థులు సుమారు 15 మంది రెండు ట్రాక్టర్లలో అక్కడకు వెళ్లి అనుమతులు చూపించాలని కోరారు. విజయవాడకు చెందిన ఓ సంస్థ పేరుతో బిల్లులు చూపించడంతో ఇసుక ట్రాక్టర్లను నిలువరించేందుకు తమ వాహనాలు అడ్డుపెట్టి సింగరాయకొండ సీఐ రంగనాథ్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన టంగుటూరు ఎస్సై ఖాదర్‌బాషా, సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి వచ్చారు. ఇసుక తరలిస్తున్న నిర్వాహకులను విచారించారు. పొంతన లేని సమాధానాలు చెబుతుండటంతో ట్రాక్టర్లు నిలిపి వేశారు. అనుమతులు తీసుకొని వస్తామని నిర్వాహకులు, డ్రైవర్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం సీఐ మాట్లాడుతూ జిల్లా రెవెన్యూ, మైనింగ్ శాఖాధికారుల నుంచి అనుమతి లేకుండా ఎవరు ఇసుక తీసుకెళ్లినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
KTR: సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా భారీ సభ.. జనసమీకరణపై నేతలతో కేటీఆర్ భేటీ
-
Movies News
Social Look: పూజా సీమంతం.. శ్రద్ధాదాస్ హాఫ్‌శారీ.. టీమ్‌తో రాశీఖన్నా!
-
World News
Earthquake: తుర్కియేలో 1100 సార్లు ప్రకంపనలు.. 17వేలు దాటిన మరణాలు
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
IND vs AUS: భారత్ X ఆసీస్.. బౌలర్లు ముగించారు.. బ్యాటర్లు ఆరంభించారు..!
-
Politics News
Chandrababu: జగన్‌ను చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది: చంద్రబాబు