logo

రైతులకు రూ.12.18 కోట్ల లబ్ధి

జిల్లాలో 2020-21 రబీ, 2021 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల కింద 45,846 మంది రైతులకు రూ.12.18 కోట్ల నగదును జమ చేసినట్లు కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు.

Published : 29 Nov 2022 02:17 IST

రాయితీ చెక్కు అందజేస్తున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌,

జడ్పీ ఛైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ తదితరులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలో 2020-21 రబీ, 2021 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల కింద 45,846 మంది రైతులకు రూ.12.18 కోట్ల నగదును జమ చేసినట్లు కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు. సంబంధిత చెక్కును ప్రకాశం భవన్‌లో సోమవారం రైతులకు అందజేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం సరఫరా నుంచి పంట విక్రయం వరకు అన్ని దశల్లో ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రుణాలు సకాలంలో చెల్లించిన వారికి సున్నా వడ్డీ అమలుతోపాటు, వర్షాల వల్ల పంటలు నష్టపోయిన వారికి కూడా తక్షణమే ఇన్‌పుట్‌ సబ్సిడీ అందిస్తున్నట్లు తెలిపారు. ఆ రెండు విభాగాల కింద జిల్లాలో మొత్తం 47,063 మందికి రూ.13.30 కోట్ల ఆర్థికసాయాన్ని అందించినట్లు వివరించారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ ఆళ్ల రవీంద్రారెడ్డి, పీడీసీసీ బ్యాంకు ఛైర్మన్‌ మాదాసి వెంకయ్య, మేయర్‌ గంగాడ సుజాత, జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు, ఏపీఎంఐపీ పీడీ రవీంద్రబాబు, ఎల్‌డీఎం యుగంధర్‌, డిప్యూటీ కలెక్టర్‌ హెలా షారోన్‌ తదితరులు పాల్గొన్నారు. తొలుత తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీక్షణ సమావేశం నిర్వహించారు.

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు