logo

అర్జీల పరిష్కారంలో సహేతుకత ముఖ్యం

స్పందన అర్జీలు తిరిగి పరిశీలించాల్సిన అవసరం లేకుండా సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ స్పష్టం చేశారు.

Published : 29 Nov 2022 02:17 IST

జిల్లా అధికారులకు అర్జీలు అందించేందుకు బారులు తీరిన ప్రజలు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: స్పందన అర్జీలు తిరిగి పరిశీలించాల్సిన అవసరం లేకుండా సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమాన్ని ఒంగోలులో సోమవారం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి అధికసంఖ్యలో తరలివచ్చిన ప్రజల నుంచి అధికారులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. అర్జీల పరిష్కారంలో సహేతుకత ముఖ్యమన్నారు. క్షేత్రస్థాయిలో వాటిని పరిష్కరిస్తున్న తీరును ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. సమావేశంలో జేసీ అభిషిక్త్‌ కిషోర్‌, ప్రత్యేక కలెక్టర్‌ సరళావందనం, డీఆర్వో ఓబులేసుతో పాటు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. తొలుత ‘డయల్‌ యువర్‌ కలెక్టర్‌’ నిర్వహించి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  

వైద్యాధికారి బసవయ్యను సన్మానిస్తున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ తదితరులు

జాతీయ అవార్డు గ్రహీతకు సన్మానం...: దర్శి మండలం బొట్లపాలెం పశు వైద్యశాలకు చెందిన వైద్యాధికారి ఎం.బసవయ్యకు జాతీయ స్థాయిలో గోపాలరత్న అవార్డు లభించింది. ఈ మేరకు ఆయనను ప్రకాశం భవన్‌లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఘనంగా సన్మానించారు. బసబయ్య అందించిన సేవలకు గాను అభినందించారు. కార్యక్రమంలో జేసీ అభిషిక్త్‌ కిషోర్‌, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిణి బేబిరాణి, డీఎల్‌డీఏ ఈవో కాలేషా పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని