logo

‘సీఎం సభలో బుర్కాల తొలగింపు దారుణం’

ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొన్న నరసాపురం బహిరంగ సభకు హాజరైన ముస్లిం మహిళల బుర్కాలను తొలగించడం దారుణమని తెదేపా మైనార్టీ విభాగం ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు షేక్‌ రసూల్‌ మహమ్మద్‌ విమర్శించారు.

Published : 29 Nov 2022 02:17 IST

కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న తెదేపా మైనార్టీ విభాగం నాయకులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొన్న నరసాపురం బహిరంగ సభకు హాజరైన ముస్లిం మహిళల బుర్కాలను తొలగించడం దారుణమని తెదేపా మైనార్టీ విభాగం ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు షేక్‌ రసూల్‌ మహమ్మద్‌ విమర్శించారు. ఈ మేరకు తెదేపా మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో ఒంగోలులోని కలెక్టరేట్‌ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రసూల్‌ మాట్లాడుతూ.. బహిరంగ సభకు ముస్లిం మహిళలు తమ బుర్కాలు, ఇతరుల నల్ల చున్నీలు తొలగించి రావాల్సిందిగా ఆదేశించి అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. మహిళలను అగౌరవ పరచడం తగదన్నారు. రాష్ట్ర మైనార్టీ విభాగం ఉపాధ్యక్షుడు కపిల్‌బాషా మాట్లాడుతూ.. మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా వ్యక్తిగత రుణాల మంజూరు చేయడంతో పాటు, ఇస్లామీ బ్యాంక్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. రంజాన్‌ తోఫాను పునరుద్ధరించడంతో పాటు, ఇమాం మౌజన్లందరికి గౌరవ వేతనం ఇవ్వాలని కోరారు. ధర్నాలో తెదేపా నాయకులు షేక్‌ అన్వర్‌బాషా, ఆరీఫా, ముంతాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు