భర్త పెన్షన్ బకాయిలు ఇప్పించాలని వృద్ధురాలి నిరసన
చనిపోయిన తన భర్తకు సంబంధించి వేతన, పెన్షన్ బకాయిలు చెల్లించాలంటూ చాట్రగడ్డ రాహేలమ్మ అనే వృద్ధురాలు... కుటుంబీకులతో కలిసి టంగుటూరు మండల పరిషత్ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళనకు దిగారు.
మండల పరిషత్ కార్యాలయం వద్ద కుటుంబ సభ్యులతో
కలిసి నిరసన తెలుపుతున్న రాహేలమ్మ
టంగుటూరు, న్యూస్‌టుడే: చనిపోయిన తన భర్తకు సంబంధించి వేతన, పెన్షన్ బకాయిలు చెల్లించాలంటూ చాట్రగడ్డ రాహేలమ్మ అనే వృద్ధురాలు... కుటుంబీకులతో కలిసి టంగుటూరు మండల పరిషత్ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళనకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఎం.నిడమానూరుకు చాట్రగడ్డ యోహాను ముప్పై ఏళ్ల పాటు స్థానిక పంచాయతీ కార్యాలయంలో స్వీపరుగా పనిచేసి 2015లో ఉద్యోగ విరమణ చేశారు. అప్పటికి ఆయనకు వేతన బకాయిలు, పెన్షన్ కలిపి రూ.11,96,444 రావాల్సి ఉంది. స్థానిక, జిల్లా అధికారుల చుట్టూ తిరిగినా ఆ మొత్తం అందలేదు. జిల్లా పరిషత్‌కు చెల్లించాల్సిన రూ.2,60,376 పింఛను కాంట్రిబ్యూషన్ మొత్తాన్ని పంచాయతీ అధికారులు చెల్లించక పోవడమే సమస్యకు కారణంగా తేలింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అనారోగ్య కారణాలతో యోహాను మృతి చెందారు. అప్పటి నుంచి రాహేలమ్మ కుమార్తెల వద్ద ఆశ్రయం పొందుతున్నారు. తన భర్తకు రావాల్సిన మొత్తం చెల్లించాలంటూ స్థానిక అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో... జిల్లా పంచాయతీ అధికారి నారాయణరెడ్డి దృష్టికి విషయం తీసుకువెళ్లారు. సమస్యను పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శి సుబ్బాయమ్మను డీపీవో ఆదేశించారు. అయినప్పటికీ కాలయాపన చేస్తూ... ఇబ్బందులకు గురిచేస్తున్నారని రాహేలమ్మ కన్నీటిపర్యంతమయ్యారు. తనకు న్యాయం చేయకుంటే చావే శరణ్యమని... కుటుంబసభ్యులతో కలిసి నిరసనకు దిగారు. స్పందించిన ఎంపీడీవో అజిత, ఈవోఆర్డీ జగదీష్ ఆమెతో మాట్లాడారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామ కార్యదర్శిని పిలిపించి మాట్లాడారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs AUS: టీ బ్రేక్.. స్వల్ప వ్యవధిలో వికెట్లు ఢమాల్.. ఆసీస్ స్కోరు 174/8 (60)
-
Movies News
Janhvi Kapoor: వాళ్ల సూటిపోటి మాటలతో బాధపడ్డా: జాన్వీకపూర్
-
Politics News
Nara Lokesh - Yuvagalam: మరోసారి అడ్డుకున్న పోలీసులు.. స్టూల్‌పైనే నిల్చుని నిరసన తెలిపిన లోకేశ్
-
India News
Mallikarjun Kharge: వాజ్‌పేయీ మాటలు ఇంకా రికార్డుల్లోనే..’: ప్రసంగ పదాల తొలగింపుపై ఖర్గే
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
ECI: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా.. షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ