logo

అత్తను గొడ్డలితో కొట్టి చంపిన అల్లుడు

మద్యం మత్తులో కుమార్తెను కొడుతున్న అల్లుడిని అడ్డుకోబోయిన అత్త అతని చేతిలో ప్రాణాలు కోల్పోయిన సంఘటన దోర్నాల మండలం పెద్దమంతనాలలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.

Published : 29 Nov 2022 02:17 IST

మృతి చెందిన నాగమ్మ

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే : మద్యం మత్తులో కుమార్తెను కొడుతున్న అల్లుడిని అడ్డుకోబోయిన అత్త అతని చేతిలో ప్రాణాలు కోల్పోయిన సంఘటన దోర్నాల మండలం పెద్దమంతనాలలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.  పోలీసులు తెలియజేసిన వివరాల మేరకు.. పెద్దమంతనాల గూడేనికి చెందిన కుడుముల వెంకటేశం, నాగమ్మలకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్దకుమార్తె వెంకటమ్మను ఇంటి పక్కనే ఉన్న భూమని నాగరాజుకు ఇచ్చి రెండేళ్ల క్రితం వివాహం చేశారు. వారికి ఏడాది వయస్సు ఉన్న కుమార్తె ఉంది. నాగరాజు మద్యం తాగి వచ్చి భార్యను తరచూ కొడుతుండేవాడు. ఆదివారం రాత్రి మద్యం తాగి వచ్చిన నాగరాజు వెంకటమ్మను కొట్టాడు. దెబ్బలు తట్టుకోలేని ఆమె పక్కనే ఉన్న పుట్టింటికి వచ్చింది. అరగంట తర్వాత నాగరాజు అక్కడికి వచ్చి  భార్యను కొట్టసాగాడు. అది గమనించిన నాగమ్మ అల్లుడిని అడ్డుకోవడంతో కోపోద్రిక్తుడైన నాగరాజు పక్కనే ఉన్న గొడ్డలి తీసుకుని ఆమె తలపై బాదాడు. ఆమె తలకు తీవ్రగాయమై మృతి చెందింది. దీంతో అతను అక్కడి నుంచి పరారయ్యాడు. నాగమ్మ భర్త వెంకటేశం సోమవారం దోర్నాల స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ మారుతీకృష్ణ, ఎస్సై శ్రీనివాసరావులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసుదర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు.

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు