అనారోగ్యంతో తండ్రి.. ప్రమాదంలో కుమార్తె
తన తండ్రి చనిపోయారని తెలిసి ఆమె హుటాహుటిన స్వగ్రామం చేరుకున్నారు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్తుండగా ఓ కారు ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
గంటల వ్యవధిలో కన్నుమూత
రాజుపాలెంలో విషాదం
చిన్న రాములు, సామ్రాజ్యం (పాత చిత్రాలు )
త్రిపురాంతకం, న్యూస్‌టుడే: తన తండ్రి చనిపోయారని తెలిసి ఆమె హుటాహుటిన స్వగ్రామం చేరుకున్నారు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్తుండగా ఓ కారు ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కళ్లముందు జరిగిన ఈ సంఘటనతో బంధువులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. ఈ సంఘటన త్రిపురాంతకం మండలం సోమేపల్లి అడ్డరోడ్డు వద్ద అనంతపురం-అమరావతి జాతీయ రహదారిపై మంగళవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజుపాలేనికి చెందిన వల్లెపు చిన్న రాములు (80) అనారోగ్యంతో సోమవారం రాత్రి ఇంటి వద్ద మృతి చెందారు. ఆయన రెండో కుమార్తె ఉప్పు సామ్రాజ్యం (45) ప్రస్తుతం కూలి పనులు చేసుకుంటూ కడపలో ఉంటున్నారు. తండ్రి మరణ వార్త తెలిసి మంగళవారం తెల్లవారుజామున ఆమె గ్రామానికి చేరుకున్నారు. సోమేపల్లి అడ్డరోడ్డు సమీపంలోని పొలంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు మంగళవారం సాయంత్రం మృతదేహాన్ని తీసుకుని బంధువులు, కుటుంబ సభ్యులు బయలుదేరారు. వారిని ఆమె అనుసరించారు. ఇంతలో గుంటూరు వైపు వెళ్తున్న కారు ఆమెను ఢీకొట్టింది. తలకు బలమైన గాయాలు తగిలి సామ్రాజ్యం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గంటల వ్యవధిలోనే తండ్రి కుమార్తెలు మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. దుఃఖాన్ని దిగమింగుకుంటూ చిన్న రాములుకు అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు సామ్రాజ్యం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం యర్రగొండపాలెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె భర్త గతంలోనే మృతిచెందారు. వారికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కూలి పనులు చేసుకుంటూ పిల్లలను ఆమె చదివించారు. ప్రస్తుతం రెండో కుమారుడు వినోద్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
KVS exam: కేవీల్లో ఉద్యోగ నియామక పరీక్ష తేదీల్లో మార్పు.. కొత్త తేదీలివే..!
-
World News
Remarriage: మాజీ భార్యతో మళ్లీ పెళ్లి ..! ఆ వివాహం వెనక కదిలించే స్టోరీ
-
General News
KTR: సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా భారీ సభ.. జనసమీకరణపై నేతలతో కేటీఆర్ భేటీ
-
Movies News
Social Look: పూజా సీమంతం.. శ్రద్ధాదాస్ హాఫ్‌శారీ.. టీమ్‌తో రాశీఖన్నా!
-
World News
Earthquake: తుర్కియేలో 1100 సార్లు ప్రకంపనలు.. 17వేలు దాటిన మరణాలు
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు