logo

జీతభత్యాలకు ముఖ ఆధారిత హాజరు అనుసంధానం

ప్రతి ఉద్యోగి ముఖ ఆధారిత హాజరు విధానంలో నమోదై ఉండాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజ్యలక్ష్మి సూచించారు.

Published : 30 Nov 2022 02:07 IST

మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో రాజ్యలక్ష్మి.. చిత్రంలో వైద్యాధికారులు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ప్రతి ఉద్యోగి ముఖ ఆధారిత హాజరు విధానంలో నమోదై ఉండాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజ్యలక్ష్మి సూచించారు. ఒంగోలులోని తన కార్యాలయంలో కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లు, హెల్త్‌ ఎడ్యుకేటర్లతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నమోదు చేసుకోని సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విధానాన్ని జీతభత్యాలతో అనుసంధానం చేయనున్నట్టు తెలిపారు. డీఐవో పద్మజ మాట్లాడుతూ.. ఏఎన్‌ఎంలు 12 వారాల్లోపు గర్భిణుల వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఉప వైద్యాధికారిణి మాధవీలత మాట్లాడుతూ.. ఫ్యామిలీ ఫిజీషియన్‌ పర్యటన ప్రణాళిక ప్రకారం చేపట్టాలని చెప్పారు. ఆర్‌బీఎస్‌కే జిల్లా సమన్వయకర్త, ఎన్‌సీడీ నోడల్‌ అధికారి భగీరథ మాట్లాడుతూ.. పీహెచ్‌సీల పరిధిలోని పాఠశాలలు, వసతి గృహాలను సందర్శించి నివేదికలు సకాలంలో ఇవ్వాలని కోరారు. గణాంక విభాగం అధికారి ప్రసాద్‌ మాట్లాడుతూ.. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలను ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో డీపీవో సుబ్బలక్ష్మి, సుగుణమ్మ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని