ఇష్టారీతిన ఇసుక దోపిడీ!
పేదలకు పారదర్శకంగా ఇసుక అందజేయాలన్న లక్ష్యం నెరవేరడంలేదు. విధానాలు మార్చినా అక్రమ వ్యాపారానికి కళ్లెం పడకపోగా దోపిడీ మరింత పెరిగింది. జిల్లాలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఇసుక నిల్వ కేంద్రాలు ఉన్నాయి.
జిల్లాలో అనధికారిక డంప్‌ల ద్వారా విక్రయాలు
ఎక్కడికక్కడ నిల్వ చేస్తున్న అక్రమార్కులు
తమ్మలూరులో అక్రమంగా నిల్వచేసిన ఇసుక
ఈనాడు డిజిటల్, ఒంగోలు: పేదలకు పారదర్శకంగా ఇసుక అందజేయాలన్న లక్ష్యం నెరవేరడంలేదు. విధానాలు మార్చినా అక్రమ వ్యాపారానికి కళ్లెం పడకపోగా దోపిడీ మరింత పెరిగింది. జిల్లాలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఇసుక నిల్వ కేంద్రాలు ఉన్నాయి. యర్రగొండపాలెంలో టన్ను అత్యధికంగా రూ.1460 ఉండగా, కొండపిలో అత్యల్పంగా రూ.940 ఉంది. ఈ కేంద్రాల నుంచి తీసుకెళ్లడానికి ప్రాంతాన్ని బట్టి రవాణా ఛార్జీల భారం ఉంటుంది. సరిగ్గా ఇదే అక్రమ వ్యాపారులకు వరంగా మారింది. ఎక్కడికక్కడ అనధికారికంగా డంప్‌లు ఏర్పాటుచేసుకుని విక్రయాలు సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
కనీసం రూ.6 వేలు వెచ్చించి..
యర్రగొండపాలెంలో టన్ను ఇసుక రూ.1460, మార్కాపురం రూ.1290, గిద్దలూరులో రూ.1215, సంతనూతలపాడు రూ.1160, కనిగిరి రూ.1155, ఒంగోలు రూ.1135, దర్శి రూ.1020, కొండపి రూ.940 ధర ఉన్నాయి. ఒక ట్రాక్టర్‌కు నాలుగు టన్నుల ఇసుక పడుతుంది. ఆ లెక్కన యర్రగొండపాలెంలో రూ.5840 ధర అవుతుంది. అక్కడి నుంచి పుల్లలచెరువు, త్రిపురాంతంకం మండలంలోని వివిధ గ్రామాలకు తీసుకెళ్లాలంటే రవాణా ఛార్జీలు మరో రూ.2 వేలు. ఇదే సమయంలో అక్రమ వ్యాపారులు రంగ ప్రవేశం చేస్తున్నారు. నిర్మాణదారుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని తమ డంప్‌ల వద్ద ట్రాక్టర్ ఇసుక రూ.6 వేల వరకు ధర పెట్టి విక్రయిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా వారు అమ్ముతున్నారు. అధికారులు ప్రశ్నిస్తే జగనన్న కాలనీలు, ప్రభుత్వ పనులకని కొందరు, స్థానిక ఎమ్మెల్యే పేరు చెప్పి మరికొందరు తప్పించుకుంటున్నారు. కాగా ప్రభుత్వ రీచ్‌లలో టన్ను రూ.475 మాత్రమే ఉన్నా..ఇసుక లోడు చేయడం, ట్రాక్టర్ బాడుగ, డ్రైవర్‌కు ఇవ్వాల్సినది కలిపి తడిసిమోపెడు అవుతోందని మరికొందరు అంటున్నారు.
పంథా మార్చేశారు
కొండపి నియోజకవర్గంలో రెండు నెలల ముందు వరకు స్టాక్‌పాయింట్ లేదు. అక్కడ ఎవరికైనా ఇసుక కావాలంటే అటు కందుకూరు, ఇటు ఒంగోలు రావాల్సిన పరిస్థితి. స్థానికంగా ఉన్న కొందరు వ్యాపారులు జరుగుమల్లి మండలంలోని వివిధ ప్రాంతాల వాగుల నుంచి అక్రమంగా తరలించి కామేపల్లి, పొన్నలూరులో నిల్వ ఉంచుతున్నారు. అక్కడి నుంచి సమీపంలో నిర్మాణాలు చేసుకునేవారితో ఒప్పందాలు చేసుకొని విక్రయిస్తున్నారు. సెబ్ అధికారులు ఇటీవల దాడులు చేయడంతో పంథా మార్చి.. ఎక్కడా నిల్వ చేయకుండా నేరుగా ఇళ్లకు చేర్చి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.
* దర్శి నియోజకవర్గంలో ఇటీవల స్థానిక అధికారులు రెండు డంప్‌లను పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు.
* ఒంగోలు శివారులో ఒక వ్యాపారి అక్రమంగా ఇసుక తెచ్చి అనధికార డంప్‌ను ఏర్పాటు చేసుకున్నారు.
* ఇసుక నిల్వకేంద్రం ధరకంటే ట్రాక్టర్‌కు రూ.500 తక్కువకు ఇస్తామంటూ మార్కాపురంలో కొందరు వ్యాపారులు ప్రకటిస్తూ అక్రమ వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు.
పరిశీలించి చర్యలు
జిల్లాలో ఇసుక కొరత లేదు. అన్ని నిల్వకేంద్రాల్లో కావాల్సిన మేరకు నిల్వ ఉంది. అక్రమంగా తరలించడం, నిల్వ చేయడంపై పరిశీలించి సంబంధితులపై చర్యలు తీసుకుంటాం.
-జగన్నాథరావు, గనులశాఖ డీడీ
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
ICAI CA exam results: సీఏ ఫౌండేషన్ పరీక్ష ఫలితాల కోసం క్లిక్ చేయండి
-
Politics News
TS Assembly: బడ్జెట్ సమావేశాలపై బీఏసీలో చర్చ.. 25 రోజుల పాటు నిర్వహించాలన్న భట్టి
-
Latestnews News
Team India: టీ20 ప్రపంచకప్ 2007 ఫైనల్ ‘ఓవర్’ హీరో.. క్రికెట్‌కు వీడ్కోలు
-
Movies News
K Viswanath: విశ్వనాథ్ ‘S’ సెంటిమెంట్.. ఆ రెండు చిత్రాల విషయంలో నెరవేరని కల!
-
General News
Krishna Tribunal: కొత్త కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలా? వద్దా?.. అభిప్రాయం వెల్లడించని ఏజీ
-
India News
Parliament: అదానీ ఎఫెక్ట్.. సోమవారానికి వాయిదా పడిన ఉభయ సభలు