logo

నాలుగు విడతల్లో రూ.144.25 కోట్ల లబ్ధి

జగనన్న విద్యాదీవెన కింద నాలుగు విడతల్లో జిల్లాకు చెందిన సుమారు 55 వేల మంది విద్యార్థులకు రూ.144.25 కోట్లను ప్రభుత్వం విడుదల చేసినట్లు రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.

Published : 01 Dec 2022 03:06 IST

విద్యాదీవెన చెక్కు అందజేస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్‌, కలెక్టర్‌
దినేష్‌కుమార్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్సీ
పోతుల సునీత తదితరులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: జగనన్న విద్యాదీవెన కింద నాలుగు విడతల్లో జిల్లాకు చెందిన సుమారు 55 వేల మంది విద్యార్థులకు రూ.144.25 కోట్లను ప్రభుత్వం విడుదల చేసినట్లు రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. ప్రకాశం భవన్‌లో బుధవారం ‘జగనన్న విద్యాదీవెన’ నాలుగో విడత నిధుల విడుదల కార్యక్రమం జరిగింది. ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ బకాయి లేకుండా ప్రతి మూడు నెలలకోసారి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందన్నారు. వసతి దీవెన కింద మరో రూ.109 కోట్ల్లకు పైగా ప్రయోజనం కలిగించినట్లు తెలిపారు. అమ్మఒడి, విద్యాకానుక, పాఠశాలల్లో నాడు-నేడు, మధ్యాహ్న భోజనం తదితర పథకాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న ఆర్థికసాయాన్ని సమర్థÄంగా వినియోగించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్సీ పోతుల సునీత, మేయర్‌ గంగాడ సుజాత, జిల్లా సాంఘిక, గిరిజన, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు లక్ష్మానాయక్‌, జగన్నాథరావు, అంజల, ఝాన్సీరాణి.. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ ఏడీ జి.అర్చన పాల్గొన్నారు. అనంతరం జగనన్న విద్యాదీవెన పథకం కింద జిల్లాలోని 55,646 మంది విద్యార్థులకు
రూ.34.97 కోట్ల చెక్కు అందజేశారు.

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు