logo

విద్యే పిల్లలకు ఇచ్చే విలువైన ఆస్తి

విద్యే పిల్లలకు అందించే విలువైన ఆస్తి అని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ పేర్కొన్నారు. కొవిడ్‌ కారణంగా తల్లిదండ్రులిద్దరూ లేదా తల్లిని కోల్పోయిన విద్యార్థులకు ‘జగనన్న అమ్మఒడి’ నిధుల విడుదల కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.

Published : 01 Dec 2022 03:06 IST

విద్యార్థులకు చెక్కు అందజేస్తున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, చిత్రంలో విద్యాశాఖ అధికారులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: విద్యే పిల్లలకు అందించే విలువైన ఆస్తి అని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ పేర్కొన్నారు. కొవిడ్‌ కారణంగా తల్లిదండ్రులిద్దరూ లేదా తల్లిని కోల్పోయిన విద్యార్థులకు ‘జగనన్న అమ్మఒడి’ నిధుల విడుదల కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అమ్మఒడి సాయాన్ని ప్రభుత్వం నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తోందన్నారు. కొవిడ్‌ కారణంగా తల్లిని కోల్పోయిన విద్యార్థులకు మాత్రం... వారి ఖాతాలోనే నిధులు జమ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆ మేరకు జిల్లాలోని 118 మంది విద్యార్థుల ఖాతాల్లో రూ.15.34 లక్షలు జమ చేస్తున్నట్లు తెలిపారు. సంబంధిత చెక్కును విద్యార్థులకు అందజేశారు. డీఈవో విజయభాస్కర్‌, ఉప విద్యాశాఖాధికారి అనితా రోజ్‌రాణి, గ్రామ, వార్డు సచివాలయాల జిల్లా ఇన్‌ఛార్జి ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని