logo

14 మంది ఎంఈవోలకు తాఖీదులు

నాడు-నేడు పనులపై నిర్వహించిన వీక్షణ సమావేశానికి గైర్హాజరైన 9 మంది ఎంఈవోలతోపాటు, నిధులు ఖర్చుచేయని మరో అయిదుగురికి డీఈవో బి.విజయభాస్కర్‌ తాఖీదులు జారీ చేశారు.

Published : 02 Dec 2022 03:00 IST

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: నాడు-నేడు పనులపై నిర్వహించిన వీక్షణ సమావేశానికి గైర్హాజరైన 9 మంది ఎంఈవోలతోపాటు, నిధులు ఖర్చుచేయని మరో అయిదుగురికి డీఈవో బి.విజయభాస్కర్‌ తాఖీదులు జారీ చేశారు. గురువారం డీఈవో ఈ సమావేశం ఏర్పాటు చేయగా కంభం, దర్శి, దొనకొండ, కొమరోలు, కొనకనమిట్ల, నాగులుప్పలపాడు, పొన్నలూరు, తాళ్లూరు, టంగుటూరు మండల విద్యాశాఖ అధికారులు హాజరుకాలేదు. వీరిలో కొమరోలు, కొనకనమిట్ల, టంగుటూరు ఎంఈవోలు గైర్హాజరుకావడం ఇది రెండోసారి. దీంతో సంజాయిషీ ఇవ్వాలని డీఈవో కోరారు. నాడు-నేడు రెండోవిడతలో విడుదలైన రివాల్వింగ్‌ ఫండ్‌ తక్కువ ఖర్చు చేసినందుకు ఒంగోలు, పెద్దారవీడు, కొనకనమిట్ల, కనిగిరి, దర్శి ఎంఈవోలకు తాఖీదులు జారీ చేశారు.

53 పాఠశాలల హెచ్‌ఎంలకు సైతం...

విద్యార్థుల హాజరు యాప్‌లో నమోదు చేయని 53 పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో విజయభాస్కర్‌ సంజాయిషీ నోటీసులు జారీ చేశారు. వీటిలో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ పాఠశాలలున్నాయి. హెచ్‌ఎంలు శుక్రవారం సాయంత్రంలోపు సమాధానం ఇవ్వాలని అందులో పేర్కొన్నారు.

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని